పశ్చిమగోదావరి

చెప్పి తప్పించుకోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 26: అధికార, ప్రతిపక్ష నాయకుల మాదిరిగా నోటికి వచ్చింది చెప్పేసి తర్వాత తప్పించుకునే వాడిని కాదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. స్ధానిక క్రాంతి కళ్యాణవేదికలో బుధవారం కూడా ఆయన వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయనను మీసేవా కేంద్రాల నిర్వాహకులు, సహకార సొసైటీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారాలు ఏవిధంగా అనే్వషించాలన్న అంశంపై కూడా వారితో చర్చలు జరిపారు. సమస్యలన్నింటిని మ్యానిఫెస్టోలో పొందుపరుస్తానని హామీ ఇచ్చారు. నాయకులు అనేవారు ముందు చెప్పేసి, తర్వాత తప్పించుకునే విధానం సరికాదని, హామీ నెరవేర్చని పక్షంలో దానికి తగిన వివరణ ఇచ్చుకోవాలన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావటమే తమ లక్ష్యమని, జవాబుదారీతనాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజంలో ఉన్న సంపద అంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోతోందని, ఆ సంపదను అందరికి పంచటమే జనసేన లక్ష్యమని చెప్పారు. మీ సేవా కేంద్రాల నిర్వాహికులతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ నిర్వాహకులకు 5లక్షల బీమా, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సహకార సంఘం ఉద్యోగుల భేటీలో మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలను పూర్తిగా అర్ధం చేసుకునేందుకు కొంత వ్యవధి కావాలని, ఉద్యోగుల నుంచే నేరుగా సమస్యలు విని అర్ధం చేసుకుని మ్యానిఫెస్టోలో ఏవిధంగా చేర్చాలన్న అంశాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. జనసేన పార్టీని ప్రతికూల పరిస్ధితుల్లో స్ధాపించానని, ప్రస్తుత రాజకీయాల్లో అవకాశవాదంతో నిండిపోయి ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాజకీయపార్టీ నడపాలంటే వేల కోట్ల రూపాయలు అవసరమని చెప్పారు. అయితే వేలకోట్ల రూపాయలు తన వద్ద లేకున్నా కోట్లాది మందికి సేవ చేయాలన్న బలమైన సంకల్పం మాత్రం ఉందని చెప్పారు. సహకార సంఘ ఉద్యోగులు కనీసం జీతాలు కూడా లేని పరిస్దితుల్లో జీవనం కొనసాగిస్తున్నారని తెల్సి ఎంతో బాధ కలిగిందన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేసుకోలేని పరిస్దితిలో సంఘాల ఉద్యోగులు ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సమస్యలన్నింటిని చిటికెలో తీర్చడానికి తనవద్ద మంత్రదండం ఏమి లేదని, సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా వాటికి పరిష్కారమార్గాలు అనే్వషించి మ్యానిఫెస్టోలో పొందుపరుస్తానని చెప్పారు. బుధవారం ఉదయం పవన్‌కళ్యాణ్ స్ధానిక ఆశ్రం వైద్యకళాశాల విద్యార్థినీ విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి వద్ద నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన నాయకత్వం, ఆలోచనా విధానం పాలకుల్లో లేకుండా పోయాయని పేర్కొన్నారు. సాటి మనిషి బాధ చూడలేకే రాజకీయాల్లోకి వచ్చానే తప్ప ఎవరో బలవంతం పెడితే రాలేదని స్పష్టం చేశారు. 25 ఏళ్లు పనిచేస్తే తప్ప బలమైన ప్రజావిధానాలను తీసుకురాలేమని, రాజకీయాల్లో ఓపిక చాలా అవసరమని చెప్పారు. జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన కల్పించి తయారీ యూనిట్లు స్థానికంగానే ఏర్పాటు చేసేలా జనసేన కృషి చేస్తుందని చెప్పారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఏరియా ఆసుపత్రి వుండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రముఖ వైద్యుడు రఘునాథరాజు మృతి
ఆకివీడు, సెప్టెంబర్ 26: ఆకివీడుకు చెందిన ప్రముఖ వైద్యులు మందపాటి రఘునాధరాజు (66) బుధవారం తెల్లవారుఝామున మృతిచెందారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రఘునాథరాజు గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు. 1979వ సంవత్సరంలో ఆకివీడుకు వచ్చిన ఈయన ప్రైవేటు ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆకివీడులోని ఎస్ టర్నింగ్‌లో రవి క్లినిక్‌ను నడుపుతున్నారు. వైద్యం చాలా ఖరీదైన ఈ రోజుల్లో పది రూపాయలకే పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందించిన ఘనత ఈయనకే దక్కింది. ఈ ప్రాంత ప్రజలకు తలలో నాలుకలా ఉండే రఘునాథరాజు 38 సంవత్సరాలుగా ఆకివీడు ప్రాంత ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నారు. రేయింబవళ్లు రోగగ్రస్థులైన ప్రజలు ఎవరు ఇంటికి వచ్చినా వైద్యాన్ని అందించారు. ఎక్కువ మందులు రాయకుండా తక్కువ ఖర్చుతో కూడిన ట్యాబ్లెట్‌లు రాస్తూ ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందారు. కొల్లేరు ప్రాంత ప్రజలకు మంచి వైద్యసేవలందించిన ఘనత ఈయనకే దక్కుతుంది. రాజమండ్రి సమీపంలోని చినకొండేపూడికి చెందిన రఘునాథరాజు ప్రముఖుల ప్రశంసలు పొందారు. బుధవారం తెల్లవారుఝామున తన స్వగ్రామంలో మృతిచెందారు. దీంతో ఆకివీడుకు చెందిన వైద్యులు, ప్రముఖులు చినకొండేపూడి గ్రామానికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కనుమూరి అబ్బాయిరాజు, వైద్యులు ఎంవి సూర్యనారాయణరాజు, సాగి రామరాజు, ప్రతాప్‌కుమార్, నవీన్, కవిత, కిరణ్, మాధవి, చంద్రబాబు, సులేమాన్, శ్రీనివాసరావు, సోమరాజు, గేదెల అప్పారావు, కిమిడి నాగరాజులు రఘునాథరాజుకు ఘనంగా నివాళి అర్పించారు. ఆకివీడు ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ రఘునాథరాజు మృతికి నివాళులర్పిస్తూ ఆసుపత్రులను మూసివేశారు.