పశ్చిమగోదావరి

ఆంధ్ర మహిళా క్రికెట్ కోచ్‌గా రమాదేవి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 26: త్వరలో జరగనున్న ఆంతర్ రాష్ట్ర మహిళా క్రికెట్ మ్యాచ్‌లకు ఆంధ్ర మహిళా జట్టు కోచ్‌గా జిల్లాకు చెందిన మహిళా కోచ్ ఎస్ రమాదేవి ఎంపికైనట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు తెలిపారు. రాష్ట్ర మహిళా అండర్-19 వనే్డ మ్యాచ్‌లకు, సీనియర్స్ ట్వంటీ-ట్వంటీ మ్యాచ్‌లకు కోచ్‌గా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. కోచ్‌గా ఎంపికైన రమాదేవిని అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఎం వగేష్‌కుమార్, కార్యవర్గసభ్యులు తదితరులు అభినందించారు.
ఉపాధ్యాయుడు రాంప్రసాద్ జాతీయ పురస్కారానికి ఎంపిక
కాళ్ల, సెప్టెంబర్ 26: మండలంలోని కోపల్లె జడ్పీ హైస్కూలులో ఇంగ్లీషు సహోపాధ్యాయుడిగా పనిచేస్తున్న డాక్టర్ కేశిరాజు రాంప్రసాద్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ట్యూటర్స్ ప్రైడ్ అందించే ఐడియల్ టీచర్స్ అవార్డు ప్రోగ్రామ్ (ఐటిడిపి)కి అందించే పురస్కారానికి రాంప్రసాద్ ఎంపికయ్యారు. ప్రొఫెసర్ల దగ్గర నుండి ఉపాధ్యాయుల వరకు సంగీతం, నృత్యం, క్రీడలు కోచ్‌లకు ఈ అవార్డు అందిస్తారు, వెయ్యిమంది టీచర్స్ నామినేషన్‌లు పంపగా తొలుత 25 మందిని ఎంపిక చేశారు. వారిలో రాంప్రసాద్‌కు చోటు దక్కింది. ఉండి ఎమ్మెల్యే శివరామరాజుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ శివ స్వచ్ఛంద సేవాసంస్థ ద్వారా చేసే ప్రతీ కార్యక్రమానికి రాంప్రసాద్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. రాంప్రసాద్ జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో రాంప్రసాద్‌కు పురస్కారాన్ని అందజేస్తారు. రాంప్రసాద్‌కు ఈ పురస్కారం లభించడం పట్ల ఆయనను పలువురు అభినందనలతో ముంచెత్తారు.

ముఖ్యమంత్రి కృషికి చేయూతనివ్వాలి
చాగల్లు, సెప్టెంబర్ 26: ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి చేయూతనివ్వాలని ఎక్సయిజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ కోరారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణగూడెంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే స్వచ్ఛగ్రామంగా గుర్తింపు పొందిన బ్రాహ్మణగూడెంను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించడం గర్వకారణమన్నారు. గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం మెరుగు పరచటానికి కృషి చేస్తానన్నారు. అభివృద్థిని చూసి ఓర్వలేని కొందరు అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని, వారికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. తొలుత ఆయన గ్రామంలో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సంపద కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మంత్రి జవహర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామదర్శిని పరిశీలకులు పరుచూరి కృష్ణ, ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్నా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కరుటూరి సతీష్ ,ఎంపీపీ కోడూరి రమామణి, టీడీపీ నాయకులు బొడ్డు రాజు, కోడూరి ప్రసాద్, గారపాటి కాశీ విశే్వశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చింతమనేని అరెస్టుకై ఉద్యమం ఉధృతం
ఏలూరు, సెప్టెంబర్ 26 : హమాలీ కార్మికుడిని కొట్టి కులం పేరుతో దూషించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టుకై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. బుధవారం ఇఫ్టూ కార్యాలయంలో బిఎస్‌పి జిల్లా అధ్యక్షులు నేతల రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. చింతమనేనిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు అయినందున డిఎస్‌పి స్థాయి అధికారి మాత్రమే విచారణ చేయాలని, అయితే విచారణ పేరుతో పోలీసు అధికారులు జాప్యం చేసే అవకాశం వుందని సమావేశం అభిప్రాయపడింది. అందువల్ల ఇందుకు సంబంధించిన ప్రక్రియ వెంటనే పూర్తిచేసి ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ భవిష్యత్తులో ప్రజా ఉద్యమాన్ని మరింత ఐక్యంగా కొనసాగించాలని నిర్ణయించారు. దశల వారీగా పోరాట కార్యక్రమాలను చేపట్టనున్నారు. బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ రాజనాల రామ్మోహనరావు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి పి కన్నబాబు, సిపిఎం నాయకులు మావూరి శ్రీను, ఎఐటియుసి నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టియు జిల్లా సహాయ కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర అధ్యక్షులు కాకర్ల అప్పారావు, బాధితుడు రాచీటి జాన్ తదితరులు పాల్గొన్నారు.