క్రీడాభూమి

అశ్విన్, ఇషాంత్‌కు 29న ఫిట్నెస్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: గాయాలబారిన పడిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లకు ఈనెల 29న ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చేనెల 4 నుంచి వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఫిట్నెస్‌పరంగా ఓకే అయితే సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఎన్‌సీఏ ఆధ్వర్యంలో అశ్విన్ వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, ఇషాంత్ కూడా ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. ఎన్‌సీఏకు చెందిన ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు వీరిద్దరు ఫిట్నెస్‌పరంగా పూర్తిగా కోలుకున్నారని ధృవీకరిస్తేనే వారిని టీమిండియా జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐ ప్రతినిధికి తెలిపాడు.