చిత్తూరు

తిరుమలేశునికి తమ గోడు వినిపించుకునేందుకు కదం తొక్కుతున్న భజన కళాకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 26: జానపద కళాకారుల బృందాలను గుర్తించి, గురువులకు ఏడాదికి ఒకసారి సన్మానం చేసి వారి ప్రతిభను గుర్తించాలని, మనగుడి కార్యక్రమంలో భజన కళాకారులను భాగస్వాములను చేయాలన్న డిమాండ్‌ను టీటీడీ అధికారుల పట్టించుకోక పోవడంతో జానపద కళాకారులు శ్రీ వేంకటేశ్వరునికే తమ గోడు చెప్పుకోవడానికి పాదయాత్రగా బయలుదేరారు. చెక్క భజనలు, పండరి భజనలు, కోలాటాలు, కులుకు భజనలు, పిల్లంగట్లు, కావడి మేళం బృందాలు గత ఆరురోజులుగా పాదయాత్రగా తిరుమలకు బయలుదేరారు. ఈనెల 21న మదనపల్లి నుంచి వేలాదిమందితో ప్రారంభమైన పాదయాత్ర గురువారం ఉదయం తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం వద్దకు చేరుకుంటుంది. ఇక్కడ మహా ప్రదర్శన అనంతరం తిరుమలకు కాలి నడకన చేరుకుంటారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి మాట్లాడుతూ జానపద కళాకారులను ధర్మప్రచారంలో ఉపయోగించుకుంటామని, సమస్యలు పరిష్కరిస్తామని గతంలో టీటీడీ ఉన్నతాధికారులు హామీలు ఇచ్చారన్నారు. ఆ తరువాత పట్టించుకోవడం మానేశారని, అందుకే కళాకారుల మహాపాదయాత్రను ప్రారంభించామన్నారు. దాదాపు వెయ్యిమంది కళాకారులు పాదయాత్రలో పాల్గొన్నారని, గురువారం టీటీడీ పరిపాలన భవనం ముందు దాదాపు 30వేల మంది తమ నిరసన తెలియజేస్తారని చెప్పారు. అనంతరం పాదయాత్రగా తిరుమలకు చేరుకుని భజన రూపంలో శ్రీవారికి తమ గోడును వినిపిస్తామన్నారు. తిరుమల నాలుగు మాడ వీధుల్లో తిష్టవేసి భజనలు సాగిస్తామన్నారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు వాయిద్య పరికరాలు, మైక్‌సెట్లు వంటి కనీస సదుపాయాలు ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అఖండ హరినామ సంకీర్తన కోసం వస్తున్న భక్త బృందాలకు కనీస వసతులు కల్పించడం లేదని, జిల్లా నలుమూలల నుంచి వచ్చే కళాకారులకు రూ. 200, ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి రూ. 250 మాత్రమే బస్సు ఛార్జీలుగా చెల్లిస్తున్నారన్నారు. తిరుపతి, తిరుమల మధ్యే బస్సు చార్జీలకు రూ. 110 ఖర్చు అవుతుంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అదనంగా ఖర్చు అవుతోందని ఆయన తెలిపారు. ప్రముఖ కళాకారుల పేరుతో వారికి లక్షలు ఖర్చు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.