బిజినెస్

మళ్లీ దెబ్బతిన్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. వరుసగా అయిదు సెషన్ల నష్టాల తరువాత మంగళవారం ఒకే రోజు బలపడిన మార్కెట్లు బుధవారం మళ్లీ బలహీనపడ్డాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీల) రంగంలో ద్రవ్య చలామణిపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో మార్కెట్‌లో కొనుగోళ్ల సెంటిమెంట్ నిరాశాజనకంగా ఉండటం బుధవారం స్టాక్ మార్కెట్‌ను దెబ్బతీసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం వెలువడనుండటం వల్ల కూడా మదుపరులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. తీవ్రమయిన ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సేవల రంగాలలో ఆయా స్టాక్‌ల నిర్దిష్ట పరిస్థితిని బట్టి క్రయవిక్రయాలు జరిగాయి. బుధవారం ఓసారి కొనుగోళ్లు, తరువాత అమ్మకాలు జోరు అందుకోవడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ సుమారు 581 పాయింట్ల మేర పైకీ, కిందికీ కదలాడింది. సెప్టెంబర్ నెల డెరివేటివ్‌ల కాంట్రాక్టుల గడువు గురువారం ముగియనుండటం వల్ల మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారని బ్రోకర్లు చెప్పారు. దేశీయ మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో సెనె్సక్స్ 36,938.74 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. తరువాత ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో 36,357.93 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 109.79 పాయింట్ల (0.30 శాతం) దిగువన 36,542.27 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ మంగళవారం 347.04 పాయింట్లు పుంజుకున్న విషయం తెలిసిందే. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 13.65 పాయింట్ల (0.12 శాతం) దిగువన 11,053.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 11,145.55- 10,993.05 పాయింట్ల మధ్య కదలాడింది. సెప్టెంబర్ నెల డెరివేటివ్‌ల కాలపరిమితి గురువారం ముగియనుండటంతో విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) అమ్మకాలకు దిగడం వల్ల మదుపరుల సెంటిమెంట్‌లో కూడా ఊగిసలాట ధోరణి నెలకొందని బ్రోకర్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఎఫ్‌ఐఐలు మంగళవారం నికరంగా రూ. 1,231.70 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 2,284.26 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో టాటా మోటార్స్ అత్యధికంగా 3.15 శాతం నష్టపోయింది. విప్రో 2.91 శాతం నష్టంతో రెండోస్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో ఐటీసీ, ఎస్‌బీఐ, మారుతి సుజుకి, టీసీఎస్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా ఉన్నాయి. యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ పదవీకాలాన్ని కనీసం మూడు నెలలు పొడిగించాలని ఆ బ్యాంకు బోర్డు మంగళవారం ఆర్‌బీఐని కోరిన నేపథ్యంలో బుధవారం ఆ బ్యాంకు షేర్ల విలువ 1.73 శాతం పుంజుకుంది. లాభపడిన ఇతర సంస్థల్లో వేదాంత లిమిటెడ్, రిల్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి.