చిత్తూరు

సీమ ప్రజలు సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 26: రాయలసీమలో లభించే వనరులను కాపాడుకునేందుకు సీమ ప్రజలు సన్నద్ధం కావాలని టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు పిలుపునిచ్చారు. తిరుపతిలోని కపిలతీర్థం వద్ద ఉన్న టాస్క్ఫోర్స్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తమిళనాడు జవ్వాది మలైకి చెందిన వారిలో మద్యంకు బానిసలైన వారిని స్మగ్లర్లు ఎంపిక చేసుకుని తిరుమల కొండల్లోని ఎర్రచందనం వృక్షాలను నరికేందుకు పంపుతున్నారని చెప్పారు. దీనిని గుర్తించి టాస్క్ఫోర్స్ సిబ్బంది జవ్వాది మలైలోని వారికి అవగాహన కల్పించడం గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం చొరవ తీసుకుని పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి మద్యం తాగకుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాల వద్ద తమ సమాచార వ్యవస్థను పటిష్టం చేశామని, అక్కడ నుంచి అందుతున్న సమాచారంతోనే స్మగ్లర్లను అడవుల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకోగలుగుతున్నామన్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఐదు లారీల్లో వస్తున్న స్మగ్లర్లను పట్టుకోగలిగామని చెప్పారు. ఆదివారం జరిగిన సంఘటన కూడా మద్యం మత్తులో జరిగిందేనని, లారీలో నుంచి కిందకు దూకినవారు మద్యం మత్తులో ఉన్నారని, పొరబాటున పక్కనే ఉన్న చెరువులో పడివుంటే వారు ప్రాణాలతో బయటపడేవారు కాదని ఐజీ ఆందోళన వ్యక్తం చేశారు. లారీలో పశువులను తరలించడమే నేరమని, అలాంటిది వందల కిలోమీటర్లు మనుషులను లారీల్లో తరలించడం మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన చెప్పారు. తమిళనాడు నుండి వస్తున్న స్మగ్లర్లు తమ వెంట ప్లాస్టిక్ సంచులు, కవర్లు, మద్యం సీసాలను అడవుల్లో ఎక్కడపడితే అక్కడే పడేస్తుండటంతో వాటిని తింటున్న జంతువులు ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని అయన ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమలోని ఎర్రచందనం, స్వచ్ఛమైన గాలి, ఇతర వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకు రాయలసీమ వాసులే ముందుకు రావాలని ఐజీ కాంతారావు పిలుపునిచ్చారు. ఆదివారం స్మగ్లర్ల లారీని వెంటాడిన విజువల్స్‌ను విడుదల చేసిన ఆయన, ఈ దాడిలో పాల్గొన్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ విలేఖరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ ఎస్పీ రవిశంకర్, డీఎస్పీ వెంకటరమణ, ఎసీఎఫ్ కృష్ణయ్య, సీఐ మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు నిర్ణీత సమయంలోపే సేవలందించాలి
* మంత్రి అమరనాథ రెడ్డి ఆదేశం
పుత్తూరు, సెప్టెంబర్ 26: నిర్ణీత సమయంలోపే సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇటీవలే అసెంబ్లీలో సర్వీసెస్ డెలివరీ గ్యారెంటీ యాక్ట్‌ను తీసుకువచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి వెల్లడించారు. బుధవారం రూ. 60లక్షలతో నిర్మించిన పుత్తూరు తహశీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సత్వరమే రెవెన్యూ సేవలు అందించాలన్న లక్ష్యంతో మీసేవ ద్వారా 60 రకాల సేవలను అందిస్తున్న విషయం గుర్తు చేశారు. నిర్ణీత సమయంలో సేవలు అందించని వారిని బాధ్యులను చేస్తూ చట్టం తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. 250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి త్వరలోనే రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. విజయపురం మండల పరిధిలోని కోసలనగరం వద్ద ఎంఎస్‌ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన మంత్రి, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇందుకు అవసరమైన సుమారు 1500 ఎకరాలను ఏపీఐఐసీ సేకరించినట్లు వివరించారు. నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ మండల పరిధిలోని తడుకు వద్ద నిర్మిస్తున్న వేణుగోపాల సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఇప్పటి వరకు ప్రత్యామ్నాయం చూపలేదన్నారు. గోపాలకృష్ణాపురం గ్రామంలో ఎస్టీలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలను రెవెన్యూ సిబ్బంది బలవంతంగా తొలగించారని, వెంటనే వారికి ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పుత్తూరు పట్టణం, రూరల్ ప్రాంతాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్న కారణంగా తహశీల్దార్ ఎక్కువ సమయం కార్యాలయంలోనే ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టుమార్టం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిని గోవిందపాళెం వద్ద ఉన్న అస్పత్రి క్వార్టర్స్‌లోకి మార్చాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, దొరబాబు, జడ్పీ చైర్మన్ గీర్వాణీ, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీషా, మున్సిపల్ చైర్మన్ యుగంధర్, వైస్ చైర్మన్ ఆనంద్, ఎంపీపీ మాధవయ్య, హెచ్‌డీసీ చైర్మన్ జయప్రకాష్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, టీడీపీ నాయకులు గాలి భానుప్రకాష్, గాలి జగదీష్, వైకాపా బీసీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డీఎన్ ఏలుమలై, రవిశేఖర్ రాజు, డీసీసీబీ డైరెక్టర్ దిలీప్ రెడ్డి, జడ్పీటీసీ కమలమ్మ, సురేష్ రాజు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. కాగా గతంలో పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అదనపు భవనాల ప్రారంభోత్సవ సమయంలో తలెత్తిన వివాదాస్పద సంఘటన తిరిగి పునరావృతం కాకుండా డీఎస్పీ భవానీహర్ష నేతృత్వంలో బుధవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.