తూర్పుగోదావరి

హోమియో క్లినిక్‌పై విజి‘లెన్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 26: అర్హత లేకపోయినా అల్లోపతి మందులు పేషెంట్లకు సిఫార్సు చేస్తున్న రాజమహేంద్రవరంలో ఒక క్లినిక్‌పై బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హతలు లేకున్నా అల్లోపతి మందులు పేషెంట్లకు సిఫార్సు చేస్తున్నారనే సమాచారంతో స్థానిక లక్ష్మీవారపుపేటలోని సత్యసాయి హాస్పిటల్ పేరుతో నిర్వహిస్తున్న క్లినిక్‌ను విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సదరు హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న ఎస్ మురళీకృష్ణకు హోమియో వైద్యంలో పట్టా ఉన్నప్పటికీ నిబంధనలకు వ్యతిరేకంగా అల్లోపతి మందులు సిఫార్సు చేస్తున్నారని గుర్తించారు. ఈ హాస్పిటల్‌కు డిఎంహెచ్‌ఓ రిజిస్ట్రేషన్ కూడా లేదని బయటపడింది. ఈ డాక్టర్ నిబంధనల ఉల్లంఘించిన నేపధ్యంలో స్థానిక త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆసుపత్రి పక్కనే వున్న ఆంజనేయ మెడికల్స్‌ను తనిఖీ చేసిన అధికారులు బిల్లులు సక్రమంగా ఇవ్వడం లేదని, తదితర లోపాలు గుర్తించి లైసెన్స్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా డ్రగ్స్ ఏడీకి విజిలెన్స్ అధికారులు సిఫార్సు చేశారు. ఈ తనిఖీల్లో రాజమహేంద్రవరం విజిలెన్స్ డీసీటీవో పీడీ రత్నకుమార్, ఏవో జె భార్గవ్ మహేష్, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ పి కోమలి, రాజమహేంద్రవరం అర్బన్ డ్రగ్ ఇనస్పెక్టర్ గోపాలకృష్ణ, వీఆర్వో డి రావు పాల్గొన్నారు.