కడప

పర్యాటక ప్రాంతాలు చిరునామా కడప జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్, సెప్టెంబర్ 30: దేశంలో ఎక్కడాలేని విధంగా కడప జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయని వాటిలో చిన్నచిన్నవి కొన్నయితే మనకు తెలియనివి మరెన్నో ప్రాచీన ప్రాంతాలు ఉన్నాయని యోగివేమన యూనివర్సిటీ ఉపకులపతి అత్తిపల్లి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం కన్సల్టెంట్ విద్వాన్ కట్టానరసింహులు అధ్యక్షతన ఆదివారం స్థానిక హరిత హోటల్‌లో రాయలసీమ టూరిజం, కల్చరల్ సొసైటీ ప్రధానకార్యదర్శి కొండూరు జనార్ధనరాజు ఆధ్వర్యంలో ఫణిశేఖర్ రచించిన 3మనరాయచోటి2 పుస్తకావిష్కరణ చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన వైవీయూ ఉపకులపతి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చరిత్ర పరిశోధనలో శాసనాలు ఒక ఆధారంగా తీసుకుంటే నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలు తెలుస్తాయన్నారు. రచయిత ఫణిశేఖర్ రచించిన మనరాయచోటి పుస్తకంలో ఆ ప్రాంతంలో లభించిన శాసనాల్లో వీరగల్లులు అధికంగా కనబడతాయన్నారు. ఇందులో వైద్యుంబుల పాలనకు చెందినవిగా తెలుస్తోందన్నారు. రేనాటి చోళులు, నోలంబులతో యుద్ధాలుచేసిన చరిత్ర తెలుస్తోందన్నారు. ఫణిశేఖర్ ప్రయత్నం ఎంతో గొప్పదని ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలని రామచంద్రారెడ్డి అన్నారు. అనంతరం జెసి-2 శివారెడ్డి మాట్లాడుతూ రాయచోటి ప్రాంత భౌగోళిక ప్రదేశాలను మనరాయచోటి అన్న పుస్తకం స్పష్టపరుస్తోందన్నారు. ఇందులో ఆ ప్రాంతంలో నివాసం ఉన్న ప్రజలు, వారి జీవన విధానం, వారి వృత్తులు, అలవాట్లు, ఆచరిస్తున్న సంప్రదాయాలు, ఆచారాల గురించి రచయిత ఫణిశేఖర్ రాయడం అభినందనీయమన్నారు. రాయచోటి ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషిచేస్తానని చెప్పారు. ప్రాచీన వారసత్వ సంపద కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. పర్యాటక పితామహుడు, సంస్థ అధ్యక్షుడ సిద్దవటం సీతారామయ్య మాట్లాడుతూ జిల్లాలో అద్భుతమైన ప్రాంతాలు, అందమైన అడవులు ఉన్నాయన్నారు. చెట్టుకు, పుట్టకు చరిత్ర ఉందన్నారు. జిల్లా వాసులు మంచినీరు అడిగితే మజ్జిగను ఇచ్చే సంస్కృతి కలవారని పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కోరారు. పర్యాటక భవిష్యత్ యువతపై ఉందని హితవుపలికారు. జిల్లా పర్యాటక అధికారి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ జిల్లా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. పర్యాటకంపై ప్రచారాలతో యువతను భాగస్వామ్యంచేసి జిల్లాచరిత్ర గొప్పతనాన్ని వెలుగుతీసేందుకు కృషి చేస్తామన్నారు. సభకు అద్యక్షత వహించిన ప్రముఖ కవి కట్టానరసింహులు మాట్లాడుతూ జిల్లాలో తూర్పు, పడమర, ఉత్తర ప్రాంతాలకు సంబంధించిన పర్యాటక ప్రదేశాలు ఇప్పటికే వెలుగులోకి పలువురు తీసుకురావడం జరిగిందని, ఈనేపధ్యంలోనే దక్షిణ ప్రాంత ప్రాచీన ఆలయాల విశిష్టత ఈపుస్తకం తెలియజేస్తోందన్నారు. ముందుగా వైవీయూ లలితకళల విభాగం సహాయాచార్యులు మృత్యుంజయరావు రూపొందించిన రాయలసీమ టూరిజం, కల్చరల్ సొసైటీ లోగోను ఉపకులపతి రామచంద్రారెడ్డి ఆవిష్కరించగా, మన రాయచోటి పుస్తకంతోపాటు సంస్థ క్యాలెండర్‌ను జేసీ శివారెడ్డి ఆవిష్కరించారు. పుస్తక రచయిత ఫణిశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో రాయచోటి ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిర్లక్ష్యానికి గురౌతూ ఎంతో వెనుకబడి వుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఈప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఎన్‌టిఆర్, వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలో జిల్లాలో కొంతవరకు అభివృద్ధి జరిగిందని, వెనుకబడిన రాయచోటి ప్రాంతాన్ని వెలుగులోకి తెచ్చేందుకు మనరాయచోటి పుస్తక ప్రయత్నమని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త పోతుల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాపర్యాటక అభివృద్ధికి తనవంతుగా ప్రతినెలా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడమేగాకుండా పర్యాటక అభివృద్ధికోసం ప్రచార బోర్డులను ఏర్పాటుచేస్తామన్నారు. ఈకార్యక్రమంలో జానమద్ది విజయభాస్కర్, బి.గంగాధర్, మల్లికార్జునరెడ్డి, మధుసూదన్, వెంకటేశ్వరాచారి, పాలగిరి విశ్వప్రసాదరెడ్డి, జ్యోతి జార్జి, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.