కడప

గడువు ముగిసింది...లక్ష్యం మిగిలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 30: జిల్లాలో కడప నగరపాలక సంస్థతోపాటు 8పురపాలక సంస్థలున్నాయి. ఈ మున్సిపాల్టీలలో 2లక్షల 31 వేలు కుటుంబాలు ఉన్నాయి. 9లక్షల 06వేలు మంది జనం నివసిస్తన్నారు. ఇంటింటికీ కొళాయి కనెక్షన్ పథకం కింద 32వేల 922 తాగునీటి కనెక్షన్లు ఆయా మున్సిపల్ వాటర్‌సెక్షన్ విభాగం అధికారులు ఇవ్వాల్సివుంది. ఈనెల 2వ తేదీతో ప్రభుత్వం నిర్దేశించిన గడువు పూర్తవుతుంది. లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇప్పటికి జిల్లాలో మున్సిపాల్టిలన్నింటిలో నేటి వరకు 21వేల 643 కనెక్షన్లు మున్సిపల్ అధికారులు ఇచ్చారు. ఇంకా 11వేల 279 కనెక్షన్లు వారి గణాంకాల ప్రకారమే ఇవ్వాల్సివుంది. తొలుత కొళాయి కనెక్షన్లు లేనిఇళ్లను గుర్తించడంలోనే మున్సిపల్‌శాఖ అధికారులు విఫలమయ్యారు. ఇంటింటా సర్వే సక్రమంగా నిర్వహించకపోవడంతో ఆదిలోనే పలు లోపాలు ఎదురయ్యాయి. దీంతో ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు మున్సిపల్‌శాఖ ఆపసోపాలుపడుతోంది. మున్సిపాలీటీలోని కంప్యూటర్లలో సాంకేతికలోపం తలెత్తడంవల్ల సమస్యలు పేరుకుపోయి ప్రజల నుంచి అందిన దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదుచేయడంలో తీవ్రజాప్యం నెలకొంది. ప్రజలు కొళాయి కనెక్షన్లు తీసుకోకపోయినా అధికారులే గుర్తించి కుటుంబాల సంఖ్యను పరిగణలోకి తీసుకుని ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు సమకూర్చాలని ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. కొన్నిచోట్ల కొళాయి కనెక్షన్లకు సంబంధించిన సామాగ్రిని లబ్దిదారులే ఏర్పాటుచేసుకోవాలని, ఆతర్వాత ప్రభుత్వం బిల్లు మంజూరు చేస్తుందని అధికారులు చెప్పడం మరింత జాప్యానికి కారణమైంది. ఒకానొక దశలో అధికారులు టెండర్లు పిలిచి, సామగ్రిని ఏర్పాటుచేయాలనే నిర్ణయం తీసుకుని దాన్ని పక్కనపెట్టారు. కొళాయి కనెక్షన్లకు కావాల్సిన సామగ్రిని లబ్దిదారులే తెచ్చుకుంటే తాము కనెక్షన్లు ఇవ్వడంలో అభ్యంతరం లేదని మున్సిపల్ అధికారులు సమర్థించుకుంటున్నారు. దీంతోప్రభుత్వ లక్ష్యం పక్కదారిపడింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది తగుమాత్రం ఉన్నా అధికారులు నిర్ణయాలు తీసుకోవడంలో కాలయాపన చేయడంలోనే పుణ్యకాలం ముగిసింది. నగర పాలక, పురపాలక సంస్థలలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి కొళాయి కనెక్షన్లు ఇచ్చి తాగునీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారి పోయింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకం సక్రమమైనప్పటికీ అధికారుల సమన్వయలోపంతో ఆమడదూరానికి జరిగింది. దారిద్య్రరేఖకు దిగువనున్న పేద కుటుంబాల నుంచి కొళాయి కనెక్షన్లకు రూ.200లు వసూళ్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్ధ్యతరగతి కుటుంబాల వారికి 8వాయిదాలలో డిపాజిట్ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు కల్పించింది. దీనికితోడు పన్నుతోపాటు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. జివోనెం.159ప్రకారం ఇంటి నీటిపన్నుల బకాయిలతో పనిలేకుండా కొళాయిలులేని ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్లు ఇవ్వాలని ఆ జీవోలో స్పష్టం చేసింది. ఈమేరకు మున్సిపల్ అధికారులు కొళాయిలు లేని కుటుంబాల సంఖ్య సర్వేప్రకారం తేల్చారు. రాజంపేటకు 346 కొళాయి కనెక్షన్లు లక్ష్యం కాగా 346కనెక్షన్లు పూర్తిచేశారు. బద్వేలు మున్సిపాల్టికీ 16881కి గాను 16881కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. రాయచోటి మున్సిపాల్టికీ 1500 కనెక్షన్లు మంజూరు చేయగా 850మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. కడప నగరపాలక సంస్థకు 6వేలకు గాను 2,276 కనెక్షన్లు మాత్రమే అమర్చారు. మైదుకూరు మున్సిపాల్టికి 260కి గాను కేవలం 60మాత్రమే సమకూర్చారు. ప్రొద్దుటూరు మున్సిపాల్టీకీ 7,220 కనెక్షన్లకుగాను కేవలం 780 మాత్రమే మంజూరు చేశారు. ఎర్రగుంట్ల మున్సిపాల్టికి 200లకు గాను కేవలం 65మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. పులివెందుల మున్సిపాల్టికి 300లకు గాను 230 కనెక్షన్లు మాత్రమే మంజూరు చేశారు.