చిత్తూరు

కుల దురహంకార హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, సెప్టెంబర్ 30: కుల దురహంకార హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కులాంతర వివాహాలకు ప్రోత్సహించి, కులాంతర వివాహాల రక్షణ చట్టం అమలుచేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. పరువుకై హత్యలు - ప్రభుత్వాల బాధ్యత అనే అంశంపై ఆదివారం మదనపల్లె పట్టణం ఎన్జీవో హోమ్‌లో సీపీఎం ఆధ్వర్యంలో చల్చావేధిక నిర్వహించారు. ఈ చర్చావేధికకు హాజరైన సీపీఎం శ్రీనివాసులు, దళిత నాయకులు నరేంద్రబాబు, మనోహర్, గౌతమ్‌కుమార్, చందు, గిరిజన నాయకులు దివాకర్, ప్రముఖ కవి పోతబోలు రెడ్డెప్ప వంటి వక్తలు మాట్లాడుతూ ప్రపంచీకరణ కులమాతాలను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రతిజాతీ కల్తీ అయిందని డాక్టర్ అంబేద్కర్ ఏనాడో చెప్పారన్నారు. కులమత వర్గ వ్యవస్తల పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు. దీనిని సమూలంగా మార్పుచేయాలంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించడమే సరైన మార్గం అన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ కులదురహంకార హత్యలను ఖండించాలన్నారు. కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించాలన్నారు. సామాజిక రుగ్మతలను పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలలో విస్తృతమైన అవగాహన కల్పించి, విద్యార్థులకు అర్థమైయ్యేలా పాఠ్యాంశాలలో చేర్చాలన్నారు. ఈ తరహాలో కేరళ రాష్ట్రంలో సీపీఎం ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమన్నారు. దళితులు రాజ్యాధికారంలో భాగం కావలంటే ఎన్నికల విధానాలలో సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సంఘటితంగా ఇలాంటి సంఘటనలను వ్యతిరేకించాలన్నారు. ఈ చర్చావేదికలో పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

యువనేస్తం దరఖాస్తుకు గడువు పొడిగింపు
* సాంకేతిక సమస్యలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తాం * బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చం నాయుడు వెల్లడి
తిరుపతి, సెప్టెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువనేస్తం పథకానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా దరఖాస్తు గడువును పొడిగించినట్లు రాష్ట్ర బసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చం నాయుడు అన్నారు. ఆదివారం తిరుపతికి విచ్చేసిన మంత్రిని టిఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయకర్త ఎ.రవినాయుడు, జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్‌లు కలిసి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుకు ఎదురవుతున్న సాంతికేక సమస్యలను, నిరుద్యోగులు పడుతున్న అవస్థలను మంత్రి వివరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆన్‌లైన్ దరఖాస్తులో ఎదురవుతున్న సమస్యలపై ఈనెల 3వ తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. వీలైనంత ఎక్కువ మందికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు టి.రంజిత్ నాయుడు, కొట్టే హేమంత్ రాయల్, కార్తీక్ చౌదరి, వెంకటేశ్ యాదవ్, హరిప్రసాద్‌లు పాల్గొన్నారు.