చిత్తూరు

కామధేను వాహనంపై గణనాధుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 30: కాణిపాకం వినాయకస్వామి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కామధేను వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈకార్యక్రమానికి కాణిపాకం నారుూబ్రాహ్మణ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్‌కు ప్రత్యేక అలంకణ చేసి దూపదీప నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులు సర్వదర్శనానికి అనుమతించారు. రాత్రి సిద్ధిబుద్ధి సమేత వినాయకస్వామి వారికి ఉభయ దారులు ఉభయ వరుస తీసుకురాగా ఆలయ అనే్వటి మండపంలో స్వామివారి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారిని కామధేను వాహనంపై గణనాధుని కాణిపాకం పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య సిద్ధిబుద్ధి సమేత వినాయకస్వామివారు భక్తులకు కనువిందు చేసారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని తరించారు. కార్యక్రమంలో ఈవో పూర్ణచంద్రరావు, ఏసి వెంకటేష్, పాలక మండలి చైర్మన్ సురేంద్రబాబు, ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.