కరీంనగర్

అన్నివర్గాల సమపాత్ర వల్లే స్వరాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, అక్టోబర్ 5: తెలంగాణ ఏర్పాటుకు అన్నివర్గాలు రాజకీయాలకు అతీతంగా సమపాత్ర పోషించడంతోనే స్వరాష్ట్రం సాధ్యమైదని.. అదేవిధంగా టీడీపీ లేఖతో తెలంగాణ చర్చ మొదలై, ప్రజల ఆకాంక్ష మేరకు 29వ రాష్ట్రంగా అందించింది కాంగ్రెసేనని మాజీ సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన జగిత్యాలలో వైశ్య సంఘ నేతలు, యువకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మహాకూటమి ఏర్పాటుకు కేసీఆర్ పాలనే ప్రధా న కారణమన్నారు. కేసీఆర్‌ది రాచరిక, నియంత్రత్వ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల కోరిక మేరకే టీడీపీ, కాంగ్రెస్ కలయిక అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉ న్నప్పుడే టీఆర్‌ఎస్‌కి కేవలం 63 సీట్లు మాత్రమే వచ్చాయని, ఇప్పుడు 36 సీ ట్లు వస్తేనే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. అందరి సహకారంతోనే గత ఎన్నికల్లో విజయం సాధించగలిగానని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాలన్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో పట్టణ వర్తక సంఘ అధ్యక్షులు ఎరవెల్లి సురేష్‌తోపాటు పలువురు వైశ్య సంఘం నేతలున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మున్సిపల్ కౌన్సిలర్లు గాజుల రాజేందర్, అనుమల్ల శ్రీనివాస్, పుప్పాల అశోక్, పిప్పరి అనిత, పులి రాము, మాజీ జడ్పీటీసీ ముస్కు ఎల్లారెడ్డి, వైశ్య సంఘ నాయకులు పెద్ది శంకర్, లింగం, కొత్త మోహన్, జిల్లా గంగాధర్, కమటాల శ్రీనివాస్, పూత్తూరి రాజేందర్ పాల్గొన్నారు.