గుంటూరు

లింగ నిర్ధారణ నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 26: ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదపడే లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. శనివారం గుంటూరు వైద్య కళాశాల ఆవరణలోని డాక్టర్ కెఆర్‌ఆర్ మోహనరావు సెమినార్ హాలులో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యాన లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం అనే అంశంపై సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగనిర్ధారణ చట్టంలోని అంశాలపై గ్రామ స్థాయిలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ పరీక్షల ఫలితంగా పుట్టబోయే శిశువు ఆడో, మగో తెలుసుకుని ఆడపిల్ల అయితే కాన్పు కాకముందే అబార్షన్ చేయించుకుంటున్నారన్నారు. చట్టరీత్యా క్షమించరాని నేరమైన ఈ చర్య నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. అలాగే స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి జి గోపిచంద్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలను అనధికారికంగా నిర్వహిస్తున్న స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. అంతేకాకుండా ఆయా కేంద్రాలకు చెందిన వైద్యాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. మారుతున్న సమాజంలో తల్లిదండ్రులు తమ ఆలోచనా ధోరణి మార్చుకోవాలన్నారు. పుట్టేది ఆడ శిశువైనా, మగ శిశువైనా ఒక్కటే అన్న భావన తల్లిదండ్రుల్లో కలగాలన్నారు. లింగనిర్ధారణ పరీక్షలను అరికట్టడానికి గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వరరావు, అదనపు ఎస్‌పి శోభామంజరి, డిఎస్‌పి సరిత, వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ షాలినీదేవి, డాక్టర్ పి రవి కిరణ్‌శర్మ, పోలీసు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. స్పష్టంచేశారు.

కార్పొరేట్ సంస్థ కట్టడాలకు
మంచినీటి సరఫరా తగదు
మంగళగిరి, మార్చి 26: మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామ పరిధిలో కార్పొరేట్ సంస్థ భారీ వెంచర్ నిర్మాణానికి పంచాయితీ నుంచి నీటి సరఫరా చేయాలనే ప్రతిపాదన తక్షణం విరమించుకోవాలని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మొసలి పకీరయ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం, నీటినిల్వ సామర్థ్యం లక్షా 50 వేల గ్యాలన్లు మాత్రమేనని, నివాస గృహాలకు 1374 కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, 68 పబ్లిక్ కుళాయిలు ఉన్నాయని, ఇంకా అనేకమంది నివాస గృహాలకు కుళాయి కనెక్షన్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారని, గ్రామ ప్రజల తాగునీటి అవసరాలకు నీటి ఇబ్బంది ఉందని, గ్రామంలోని హనుమాన్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, చంటిగారి ప్లాట్ ఏరియా, వైఎస్‌ఆర్ కాలనీ, కొబ్బరితోట ప్రాంతంలో నివాసం ఉంటున్న సుమారు వేయి కుటుంబాల వారికి సక్రమంగా నీటిని అదించలేక పోతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో పైగా వేసవి కాలంలో నీటికోసం ప్రజలు అవస్థలు పడుతుంటే కార్పొరేట్ సంస్థలకు నీరు ఇవ్వాలనే ఆలోచన వెనుక అవినీతి దాగి ఉందని పకీరయ్య అన్నారు. తక్షణం గ్రామప్రజల తాగునీటి అవసరాలకు నీరు అందించేందుకు కొత్త పైపులైన్లు వేయాలని, కార్పొరేట్ సంస్థలకు నీళ్లు ఇవ్వాలనే ప్రయత్నం విరమించు కోవాలని ఆయన కోరారు.

వైభవంగా అమరావతి నాటకోత్సవం
అమరావతి, మార్చి 26: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో శనివారం సాయంత్రం అమరావతి నాటకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ సమర్పించిన స్వామివివేకానంద నాటక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. స్వామివివేకానందునిగా వైకె నాగేశ్వరరావు, రామకృష్ణ పరమహంసగా కెఆర్‌కె మూర్తి, శిష్యుడుగా రామారావు, వ్యాపారిగా జి సాం బశివరావు, స్టేషన్ మాస్టర్‌గా డాక్టర్ రామకృష్ణశాస్ర్తీ, రాజా మంగళ్‌సింగ్‌గా డి తిరుమలేశ్వరరావు, మిఠాయి వ్యా పారిగా జనార్ధన్, భటుడుగా జి మల్లిఖార్జునరావు, నౌకరుగా నరసింహారా వు తమ తమ పాత్రలను రక్తికట్టించా రు. వివేకానందుడి జీవితచరిత్రలో మధుర ఘట్టాలను నాటకరూపంలో ప్రదర్శించారు. అంతకుముందు పదకోకిల పద్మశ్రీ ఆలపించిన అన్నమాచా ర్య సంకీర్తనలు, కుమారి క్రాంతి బృం దంచే ప్రదర్శించిన అమరావతి నృత్యరూపకం ప్రేక్షకులను ఆలరించింది. అ నంతరం జరిగిన నాటకోత్సవ సభలో ముఖ్యఅతిథిగా డాక్టర్ వావిలాల సు బ్బారావు మాట్లాడుతూ నాటక రంగాని కి తిరిగి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సభకు రంగస్థల ప్రయోక్త కావూరి సత్యనారాయణ అధ్యక్షత వహించగా అమరావతి స్వా గతగీత రచయిత భగీరధ మాట్లాడు తూ పాశ్చాత్య సంస్కృతి ప్రజల్లోకి రా వడం వలన కళారంగాలు కనుమరుగయ్యాయని, ఆధునిక ప్రపంచంలో భక్త్భివం పెరగడంతో తిరిగి కళారంగం పూర్వవైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సభలో శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్ కరస్పాండెం ట్ మల్లెల శ్రీనాథ్‌చౌదరి, కొండవీటి డె వలపర్స్ అధినేత కొండవీటి శ్రీనివాసరావు, కార్తీక డెవలపర్స్ అధినేత వివి రాఘవరెడ్డి పాల్గొన్నారు. అతిథులు, కళాకారులను కొండవీటి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలతో
మొక్కజొన్న రైతు దిగాలు
తాడేపల్లి, మార్చి 26: వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో మొక్కజొన్న రైతులు కుదేలవుతున్నారు. మండలంలోని కృష్ణాతీర గ్రామాలైన ప్రాతూరు, గుండిమె, చిర్రావూరు, మెల్లెంపూడి, కుంచనపల్లి తదితర గ్రామాల్లో రైతులు సుమారు 1500 హెక్టార్లు మొక్కజొన్న పంట వేశారు. ఆయాగ్రామాల్లో కాలువల వసతి లేక, పొలాల్లో వేసుకున్న బోర్ల నుండి నీరు అందక వేసవి తాపానికి పంట ఎండిపోతుందంటున్నారు. ఎం డలు ఎక్కువగా ఉండటంతోపాటు కృ ష్ణాతీరంలో కొనసాగుతున్న ఇసుక త వ్వకాల వల్లకూడా భూగర్భ జలాలు అడుగంటి తమ బోర్లలో నీరు రావ డం లేదని రైతులు వాపోతున్నారు. అ ధికారులు కూడా ఒకవారం పగలు, మరొక వారం రాత్రులందు కరెంట్ సరఫరా చేస్తున్నప్పటికీ పొలాలకు సంపూర్ణంగా నీరు అందటంలేదంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎకరాకు సుమారు 30 వేల రూపాయలు పెట్టుబడిపెట్టి రైతులు పంట ఎదుగుదలలేక దిగుబడి తగ్గిపోతుందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు విషయమే మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా ఒక శాతం యూ రియా, ఇతర అవసరమైన ద్రావణాల్ని పంటకు ఉపయోగిస్తే ఇటువంటి పరిస్థితిని కొంతమేరకు ఎదుర్కొవచ్చని, అదే క్రమంలో తుంపర పద్ధతుల్లో నీరు అందించే యంత్రాలు ఉపయోగిస్తే పొలంలోని పైపొరలు తడిసి మొక్కజొన్న కొంత బలంగా ఉంటుందని, రైతులు ఈ సూచన పాటించాలని తెలిపారు.

రాష్టస్థ్రాయి సేద్య విభాగంలో విజేత అనంతవరం ఎడ్లజత

మాచవరం, మార్చి 26: సింగరుట్ల లక్ష్మీనరసింహస్వామి కల్యాణ వేడుకల సందర్భంగా నిర్వహించిన రాష్టస్థ్రాయి సేద్యం విభాగంలో పొన్నూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బ్రదర్ ఎడ్లజత 3,600అడుగులు లాగి ప్రథమ స్థానం లో నిలిచాయి. గుంటూరు రూ రల్ మండలం దోబిశెట్టి ఆంజనేయులు ఎడ్లజత 3160 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచింది. రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన బీ వెంకటసతీష్‌కుమార్ ఎడ్లజత 2961 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచింది. గుంటూరు రూరల్ లింగాయపాలెం ఎల్లం సాంబశివరావు మాచవరం మండలం పినె్నల్లి గ్రామానికి చెందిన టిక్కిలి తేజస్విని ఇరుజతలు 2,755 అడుగుల దూరం లాగి చతుర్ధస్థానంలో నిలిచాయి. కృష్ణా జిల్లా మొవ్వ గ్రామానికి చెందిన తాతినేని పిచ్చేశ్వరరావు ఎడ్లజత 2,753 అడుగుల దూరం లాగి పంచమ స్థానంలో నిలిచాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు కమిటీ సభ్యులు నగదుతోపాటు షీల్డులను అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందిపాటి షర్మిల, పాశం నాగిరెడ్డి, వై హనుమంతరావు, గుర్రం సుబ్బారావు, ఎన్ శ్రీనివాసరావు, వ్యాఖ్యాతగా రాధాకృష్ణ, శ్రీను వ్యవహరించారు. జూనియర్స్ విభాగంలో శనివారం రాత్రి పది జతలు పోటీల్లో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.