హైదరాబాద్

సీనియర్ జర్నలిస్ట్ ఎన్‌జే ప్రసాద్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, యూనియన్ నాయకుడు ఎన్ జే ప్రసాద్ (65) అనారోగ్యంతో సోమవారం నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్‌జే ప్రసాద్ చికిత్స కోసం నిమ్స్‌లో చేరగా ఆసుపత్రిలోనే మృతి చెందారు. ఆంధ్రభూమి దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఎన్‌జే ప్రసాద్ మరణ వార్త తెలియగానే ఆంధ్రభూమి రెసిడెంట్ ఎడిటర్ సదాశివ శర్మతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు నిమ్స్‌కు వెళ్లి భౌతికకాయానికి నివాళులు ఆర్పించారు. ఆ తర్వాత ఆయన భౌతికకాయాన్ని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు తరలించారు. జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు, పలువురు జర్నలిస్టులు, మిత్రులు ప్రెస్‌క్లబ్‌లో ఎన్‌జే ప్రసాద్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు ఆర్పించారు. వీరిలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి, కార్యదర్శి రాజవౌళి చారి, ఎండీ అబ్దుల్ ఉన్నారు. నిజాంపేట శ్మశానవాటికలో మంగళవారం దివంగత ఎన్‌జే ప్రసాద్ అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.