రంగారెడ్డి

లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును రెండు దఫాలుగా చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, అక్టోబర్ 15: లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును రెండు దఫాలుగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి డిమాండ్ చేశారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు సాధన కోసం చేపట్టిన పాదయాత్ర షాద్‌నగర్‌కు చేరుకుంది. స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్‌డీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాఘవచారి మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు ఫేస్-1 కింద జూరాల నుండి కృష్ణానది నీళ్లు తేవడంతోపాటు ఫేస్-2 కింద శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకురావాల్సిన అవసర ఎంతైనా ఉందని అన్నారు.
షాద్‌నగర్ గడ్డకు కృష్ణానది నీళ్లు తీసుకువస్తేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందే తప్ప లేనిపక్షంలో ఏడారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు దళారీ పాత్ర పోషించడం వల్లే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. షాద్‌నగర్ గడ్డను ఏడారిగా మార్చేందుకు రాజకీయ నాయకుల కుట్రలో భాగమేనని, ఓట్లు కోసం వస్తే ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఓటరుపై ఉందని అన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంటలు ఎండిపోయి అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు లేవని అన్నారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన నేతలు వ్యతిరేక విధానాలు అవలంభించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలను రాజకీయ నాయకులు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు.
ఉదండపూర్ వద్దకు శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకువచ్చాని, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు చెవేళ్ల మీదుగా లక్ష్మీదేవిపల్లికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాగునీరు లేక అన్నదాతలు ఉన్న భూములను విక్రయించుకోని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు వెళ్తున్నారని వాపోయారు. రాజకీయ నాయకుల అలసత్వం కారణంగానే దేశానికి అన్నం పెట్టే రైతన్నలు అప్పుల ఊబిలో కొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, నాయకులను నిలదీయాల్సిన అవసరం అసన్నమైందని అన్నారు.
పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధాన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్, తిరుమలయ్య, అర్జునప్ప, బాదేపల్లి సిద్ధార్థ, రవీంధ్రనాథ్, విద్యార్థి సంఘాల నాయకులు గిరిగౌడ్, పవన్, కళాకారులు బృందం సభ్యులు పాల్గొన్నారు.