స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -- 122

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

భర్త కూడా సుకృత = శుభకర్మ పరాయణుడు, సదా వితరణశీలి, యాజ్ఞికుడు మరియు నిత్య పరిశ్రమశీలి కావడమే అతడి పరమధర్మం.

మాకు
దారిద్య్రగృహం (జన్మ)వద్దు
అధా మనే్య శ్రత్తే అస్మా అధాయి వృషా చోదస్వ మహతే ధనాయ
మా నో అకృతే పురుహూత యోనావింద్ర క్షుధ్యద్భ్యో
వయ ఆసుతిం దాః॥ ఋ.1-104-7॥
భావం:- ఇప్పుడు నీ మహత్వాన్ని అంగీకరిస్తున్నాను. నీ యెడల శ్రద్ధ్భాక్తులను వహిస్తున్నాను. నాకు సుఖదాయకుడవై అత్యధిక ధనార్జనకు ఉత్సాహపరచు. ఓ పురుహూత! అందంగా సుఖవంతంగా లేని గృహంలో- జన్మలో ఉండేటట్లు చేయకు. ఓ ఇంద్రా! ఆకలి గొన్నవారికి సమృద్ధిగా అన్నపానీయాల నిమ్ము.
వివరణ:- భగవంతునిపై శ్రద్ధ్భాక్తులేర్పడడం ఒక గొప్ప అదృష్టం. అది పూర్వజన్మకృత పుణ్యవిశేషం వలననే అబ్బుతుంది. అదే లేకుంటె ఎవరైనా తమను దయతో కాపాడే పరమాత్ముని యెడల కూడ విముఖంగానే ఉంటారు. అయితే కొందరు జీవితంలో ఎదురుదెబ్బలు తిని ‘అధామనే్య శ్రత్తే అస్మా అధాయి వృషా’ ఇప్పుడు నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నీ యెడల శ్రద్ధ్భాక్తులను వహిస్తున్నాను. నీవు సుఖప్రదాతవు. నాకు సుఖం కావాలి. నీ భక్తుల ‘యో వైభూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి’ (్ఛందోగ్యోపనిషత్తు 7-23-1) సుఖం కొంచెంలో లేదు ఏదయినా అధికంగా కలిగియుండటంలోనే ఉంది. అందుచేత ‘చోదస్వ మహతే ధనాయ’ అత్యధిక ధన లబ్ధికై నన్ను ఉత్సాహపరచు అని ప్రార్థిస్తుంటారు.
ఆ ప్రార్థనా మహిమతో ఓ దేవా! విశ్వాసంతో నీ యెడల శ్రద్ధ్భాక్తులు కలిగి నీ దరిజేరినా స్వల్పంగా ధన సమృద్ధివలన తృప్తిపడతానా? ఎన్నటికి పడను. అధిక సంపత్తినే కోరుకొంటాను. ఈ లోకంలో ధనహీనుడనై వ్యర్థంగా మరణింపను. మిక్కిలి ధన సంపాదనకు మార్గం చెప్పు. ధనం మీ నా ఆకాంక్ష ఉన్నత స్థాయికి చేరింది. కాబట్టి ననె్నన్నడూ ‘మా నో అకృతే పురుహూత యోనౌ’ శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగానున్న గృహంలో అంటే హీనజన్మలో ఉంచకు. గృహమే ప్రాప్తమయితే తీర్చిదిద్దబడి అలంకృతమై యుండేదే కావాలి. జన్మమే లభిస్తే సుఖకరమై సర్వసుఖసాధన సంయుక్తమై యుండాలి. ఇల్లు ఇచ్చి ప్రయోజనమేమిటి? తినేందుకు తిండి లేకపోతే? అప్పుడా ఇల్లు పూర్తిగా వ్యర్థమేగదా. అందుచే ‘క్షుధ్యద్భ్యో వయః’ (ఋ. 7-89-1) ఓ వరుణదేవా! నాకు మట్టి కొంప ప్రాప్తించకుండుగాక! ‘సహస్ర స్థూణ’ వేలకొలది స్తంభాలతో నిర్మింపబడ్డ భవనాన్ని కోరుకొంటున్నాను.
ఈ విధంగా భగవత్సన్నిధికి చేరి సుఖజీవితాన్ని మరియు ఆనందమయ జన్మను కోరి ప్రార్థించే భక్తుని ప్రార్థనా రూపంగా భగవదనుగ్రహం పొందిన వానికి ప్రాప్తమయ్యే ఆనందమయ జీవిత వైభవాన్ని ఋగ్వేదం మనోహరంగా వర్ణిస్తూ దైవకృపాపారతను స్పష్టం చేసింది.
**
బాల్యం నుండి సత్కార్యాచరణ
అపుడే జీవన శాంతి లబ్ధి అవుతుంది.
ఆదంగిరాః ప్రథమం దధిరే వయ ఇద్ధాగ్నయః శమ్యా యే సుకృత్యయా
సర్వం పణేః సమవిందంత భోజనమశ్వావంతం గోమంతమా పశుం సరః॥
ఋ 1-83-4॥
భావం:- ఎవరు నిర్ధూమమై ప్రజ్వలిస్తున్న అగ్నివలె జ్ఞాన, తేజస, వీర్యాది అగ్నులచే ప్రకాశిస్తూ జీవిత ప్రథమ దశలో శాంతిదాయకమైన సత్యర్మానుష్ఠానపరాయణులై యుంటారో వారు జీవితోపయోగకరమైన అశ్వసంపద, గోసంపద, వాంఛనీయమైన వస్తుసముదాయ మరియు ప్రశంసార్హమైన భక్ష్యభోజ్య పదార్థ సంజాతమూ పొందుతారు.
వివరణ:- బాల్యం, కౌమారం, వనం, వృద్ధాప్యం అని జీవితం శాస్ర్తియంగా నాలుగు భాగాలు. శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మవికాసాలకు; పుష్టి- వృద్ధిశుద్ధులకు జీవిత ప్రథమ భాగమైన బాల్యం చాల ముఖ్యమైనది. అసలు జీవిత ప్రధాన గమ్యం శాంతి లబ్ధి జీవితారంభమైన బాల్యంలో ఆ శాంతి సాధనకు తగిన కర్మానుష్ఠానం చేస్తే అంతిమంగా మనిషికి అంతిమ గమ్యస్థానమైన శాంతి లభిస్తుంది. జీవితారంభమైన బాల్యంలోనే కుటిలత, దుష్టాచరణ మొదలయిన శాంతి విఘాతకమైన దుర్వ్యసనాలలో చిక్కుకుపోతే వాటిని జీవితంలో వదిలించుకోవడం దాదాపు దుర్లభమే. ఈ విషయాన్ని స్పష్టంచేసే ఒక ఫారసీ సామెత ఒకటి యుంది. అదేమంటే- ‘‘తాపీ పనివాడు గోడకట్టే సమయంలో మొదట వంకర ఇటుకనుపెట్టి గోడ కడితే ఆ గోడ ఆకాశం వరకు కట్టబడినా అది వంకరగానే నిర్మాణమవుతుం’’దని బాల్యంలో చక్కబడినవాడు జీవిత పర్యంతమూ చక్కబడడన్న మరో వైజ్ఞానిక సత్యాన్ని గూర్చి వేదం ‘ఆదంగిరాః ప్రథమం దధిరే వయ ఇద్ధాగ్నయః శమ్యా యే సుకృత్యయా’ ప్రజ్వలించే అగ్నిలా ఎవడు జీవన ప్రథమార్థమైన బాల్యంలో శాంతిదాయకమైన సత్కర్మాచరణ చేస్తాడో అని వివరించనారంభించింది.

(ఇంకావుంది)