రాష్ట్రీయం

దుర్గమ్మగా కనకదుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వేదఘోషతో పులకించిన ఇంద్రకీలాద్రి * అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ కోడెల, సీఎస్ పునేఠా, ప్రముఖులు
విజయవాడ, అక్టోబర్ 17: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాల్లో 8వ రోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు బుధవారం కనకదుర్గమ్మ శ్రీదుర్గాదేవిగా భక్తకోటికి దర్శనమిచ్చింది. దుర్గాష్టమికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సెలవు దినం కావటంతో తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జై కనకదుర్గ నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరులు మార్మోగాయి. శ్రీ దుర్గాదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా, రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జీ అనంత రాము, మాజీ మంత్రి పీతల సుజాత, బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
పాలక మండలి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, ఈవో వీ కోటేశ్వరమ్మ, ఏఈఓ అచ్యుత రామయ్య, అర్చక స్వాములు, ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రముఖులకు స్వాగతం పలికి అంతరాలయంలో ప్రత్యేక పూజలు, వేద పండితుల ఆశీర్వచనం చేయించి దుర్గమ్మ, క్యాలండర్, ప్రసాదాలను అందించారు.