శ్రీకాకుళం

పంట నష్ట జాబితాల్లో అక్రమాలు ..వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖలు నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్ ఎన్‌పేట, నవంబర్ 1: తిత్లీ తుపాను, వంశధార వరదమూలంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం జాబితాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖలు నిర్లక్ష్యంగా జాబితాలు తయారుచేయడంతో అర్హులైన రైతుల పేర్లు గల్లంతయ్యాయి. ఆన్‌లైన్‌లో పొందుపరిచిన పేర్లును గురువారం రైతులు చూసి గగ్గోలు పెడుతున్నారు. అర్హులైన రైతులకు ఆదుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పంట నష్టపరిహారం పొందలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మండలంలోని వంశధార నదీతీర గ్రామాల్లో తిత్లీ తుపాను, వరదముంపునకు పంటలు నష్టపోయాయి. గతంలో భారీ అక్రమాలు చోటు చేసుకోవడంతో రైతులు అధికారులను నిలదీశారు. అక్రమాలు సరిదిద్దుతామని చెప్పి జాబితాల్లో కూడా తప్పులు సరిదిద్దకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూమి లేని వారు పరిహారం పొందగా, భూములున్న రైతులకు కొంతమందికి నామమాత్రంగా పరిహరం కోసం ఉండగా, మరికొంతమంది రైతుల పేర్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ, రెవెన్యూశాఖలు ఒకరిపై ఒకరు తమ తప్పిదాలను వేసుకుంటున్నారు. ఉన్నతాధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు విమర్శిస్తున్నారు. రెవెన్యూపరంగా జాబితాలో భూముల పరిహారానికి నమోదు కాకపోవడంతో పాటు ఒన్‌బిల కంటే అధికంగా భూములు నమోదు చేశారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా రూపొందించిన జాబితాలను సమగ్రంగా పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకొని అర్హులైన వారికి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
రాష్టస్థ్రాయి యోగాకు సంతోషి
ఎల్ ఎన్‌పేట, నవంబర్ 1: మండలంలోని లక్ష్మీనర్సుపేట కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న వై.సంతోషి రాష్టస్థ్రాయి యోగా పోటీలకు ఎంపికైనట్టు కేజీబీవీ ఎస్‌వో భవానీ గురువారం తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన సంతోషికి సిబ్బంది,పలువురు హర్షం వ్యక్తం చేశారు.

సభ్యత్వ నమోథుతో పార్టీ బలోపేతం
* ఎమ్మెల్యే రమణమూర్తి
జలుమూరు, నవంబర్ 1: గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ మరింత పటిష్టం అయ్యేందుకు పార్టీ సభ్యత్వ నమోదు అవసరమని స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మండలం శ్రీముఖలింగం గ్రామంలో గురువారం సభ్యత్వనమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. టిడీపీ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తుందని, ఆపార్టీకి మరింత చేయూత అవసరానికి గ్రామాల్లో సభ్యులు అవసరమని అన్నారు. ప్రతీ గ్రామంలో పార్టీ విజయానికి సరిపడే బలం వున్న మరింత బలోపేతానికి సభ్యత్వం అవసరమని ఆయన అన్నారు. గ్రామస్థాయిలో ప్రతీకార్యకర్త, క్రియాశీలక సభ్యులు శతశాతం సభ్యత్వనమోదాన్ని చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి అధ్యక్షులు వెలమల చంద్రభూషణ, మండల టీడీపీ అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు,మండల జన్మభూమి కన్వీనర్ బగ్గు గోవిందరావు, స్థానిక మాజీసర్పంచ్ ప్రతినిధి తర్ర బలరాం, కరకవలస మాజీ సర్పంచ్ ప్రతినిథి పొన్నాడ దాలయ్య, పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.