అంతర్జాతీయం

ఔను.. వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 30: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సోమవారం ఫ్రాన్స్‌లో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో వారు ఏమి మాట్లాడుకున్నదీ తెలియరాలేదు. కాన్ఫరెన్స్ సెంటర్ లాబీలో కరచాలనం చేసుకున్న మోదీ, నవాజ్ ఆ తర్వాత అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని మాట్లాడుకోవడం కనిపించింది. వీరిద్దరు కరచాలనం చేసుకుంటున్న ఫొటోను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ‘ట్విట్టర్’లో పోస్టు చేశారు. అయితే వీరిద్దరు ఏమి మాట్లాడుకున్నారన్న దానిపై ఇప్పటివరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. మోదీ, నవాజ్ ఇంతకుముందు రష్యాలోని ఉఫాలో జూన్ 10వ తేదీన సమావేశమై వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు భేటీ కావడం ఇదే తొలిసారి.