మెదక్

అర్హులందరికి సంక్షేమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, నవంబర్ 9: అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందించి అభివృద్ది పరిచడం కెసిఆర్‌కే సాధ్యమని తాజా మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తేనే బీడు భూములు సస్యశ్యామలమవుతాయని పేర్కొన్నారు. హవేళీఘణాపూర్ మండలం బ్యాతోల్ గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్యాప్య పించన్ల వయసు 65 నుండి 58కి తగ్గించడం జరిగిందని, వెయ్యి నుండి 2016, 1500 నుండి 3016కు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఎన్ని కుట్రలు పన్నినా టిఆర్‌ఎస్ గెలుపు, కెసిఆర్ సిఎం కావడం ఖాయమన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో జడ్‌పటిసి లావణ్యారెడ్డి, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, అంజాగౌడ్, గంగాధర్, నాయకులు హన్మంతరెడ్డి, సుభాష్‌రెడ్డి, మండల కిషన్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
* తాజా మాజీ సర్పంచ్ టిఆర్‌ఎస్‌లో చేరిక
బ్యాతోల్ తాజామాజీ సర్పంచ్ సువర్ణ నారాయణరెడ్డి టిఆర్‌ఎస్ తీర్థం పుచుకున్నారు. కండువాకప్పి పార్టీకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి గ్రామంలోకి రాగానే మంగళహారతులతో స్వాగతం పలికారు. మండల కో ఆప్షన్ మెంబర్ ఇంటికి వెళ్లగా దట్టికట్టి శాలువా కప్పి సత్కరించారు. గ్రామంలో పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించారు. మత్స్యకారులు అలంకరించిన చేపల వలతో స్వాగతం పలికారు.