మెదక్

టీఆర్‌ఎస్‌దే అధికారం అంటున్న జాతీయ సర్వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 9: మంత్రి పదవి తనకు లక్ష్యం కాదని, అయితే గౌడ జాతి ఉన్నతంగా బ్రతకాలన్నదే ద్యేయమని రాష్ట్ర మంత్రి పద్మారావు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్ లో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అథితిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే గీతకార్మికులు తీవ్ర దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటుండగా, సీఎం కేసీఆర్ గౌడ జాతి కోసం చేతనైనంత చేయూతనిచ్చినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా జంటనగరాలలో కల్లు దుకాణాలను తెరిపించడంతోపాటు పాత బకాయలు, ఆబ్కారీపన్ను, చెట్టు, రెంటల్ ఫీజులను రద్దు చేసిన ఘనత టీఆర్‌ఎస్ సర్కార్‌దేనని తెలిపారు. అంతేగాకుండా సొసైటీలకు జీవం పోయడంతోపాటు ఎక్సైజ్‌శాఖ ద్వారా స్వచ్ఛమైన కల్లు అందించేందుకు కోటి 70లక్షల ఈత మొక్కలు నాటినట్లు చెప్పారు. గీత కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని నీరాను ఉత్పత్తి చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటుండగా, నీరా నిలువ కోసం రూ. కోటి నిదులు మంజూరీ చేసి తగిన పరిశోదనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గీత కార్మికులకు పాక్షికంగా దెబ్బతగిలినా, మృతి చెందినా ఆ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం అందిస్తుండగా, భవిష్యత్తులో గీత కార్మికుల మరణాలు ఉండవద్దనే లక్ష్యంతో ముందుకెల్తున్నట్లు తెలిపారు. సొసైటీ అధ్యక్షుడిగా గీత కార్మికుల ఇబ్బందులు తనకు తెలుసని, ఈ అంశంపై పలు సందర్బాల లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సమక్షంలోనే తన ఆవేదన వ్యక్తం చేసినట్లు స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత గీత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తుండగా, గజ్వేల్ నుండి కేసీఆర్‌ను గెలిపించి పాత 10 జిల్లాల గౌడ సమాజం అభివృద్దికి సహకరించాలని కోరారు. దుష్టశక్తుల మాటలు నమ్మకుండా గౌడ కులస్తుల సంక్షేమానికి పాటుపడే కేసీఆర్‌కు అండగా నిలవాలని, అప్పుడే మనందరం కేసీఆర్‌కు అత్యంత విశ్వాసం పొంది ఇబ్బందులు తొలగించు కోవడానికి వీలు కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పోరేషన్ చైర్మెన్‌లు భూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మాజీ మంత్రి రాజేశంగౌడ్, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ చంద్రాగౌడ్, జెడ్‌పీటీసీ వెంకట్ గౌడ్, కౌన్సిలర్ రేగొండగౌడ్, నాచగిరి ట్రస్టుబోర్డు మాజీ చైర్మెన్ సత్యనారాయణగౌడ్, జిల్లా బీసీసెల్ అధ్యక్షులు సురేశ్‌గౌడ్, నేతలు దేవేందర్ గౌడ్, అశోక్‌గౌడ్, శ్రీశైలంగౌడ్, అర్జున్‌గౌడ్, రవీందర్‌గౌడ్, పాండుగౌడ్, విద్యాకుమార్, రాజేశ్‌గౌడ్, యాదాగౌడ్, అంజనేయులుగౌడ్, బాబుగౌడ్, ప్రభాకర్‌గౌడ్, లక్ష్మినర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లమ్మ ఆలయాల అభివద్దికి చేయూతనివ్వాలని గౌడ సంఘం నేతలు మంత్రి పద్మారావు దృష్టికి తేగా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఫలితాలు వచ్చిన అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తన నిదుల నుండి రూ. కోటి మంజూరీ చేయనున్నట్లు పేర్కొన్నారు.