మెదక్

కేసీఆర్‌ను ఎధుర్కొనే సత్తా ఎవరికీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 9: రాష్ట్రంలో కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా ఎవరికి, ఏ పార్టీకి లేదని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి గజ్వేల్‌లోని పీఎన్‌ఆర్ గార్డెన్స్‌లో ఆయా గ్రామాలకు చెందిన 200ల మంది టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా ఆయన మాట్లాడారు. మోసాల కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఇక చెల్లుచీటేనని, త్యాగాల టీఆర్‌ఎస్‌కు ప్రజలు అండగా నిలిచి సీఎం కేసీఆర్‌ను ఆదరిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్న ద్రోహి ఏపీ సీఎం చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్న కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పనుండగా, మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబుకు ఇక్కడ పనేమిటని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు మాయల కూటమిగా మారగా, టీఆర్‌ఎస్‌దే తిరిగి అధికారమని జాతీయ సర్వేలు చెబుతున్న విషయాన్ని గమనించాలని సూచించారు. కుట్రలు, కుతంత్రాలకు మారుపేరుగా టీడీపీ నిలుస్తుండగా, తన ప్రశ్నలకు జవాబు చెప్పలేని దుస్తితిలో చంద్రబాబు ఉన్నట్లు ఎద్దేవా చేశారు. మరో 2 రోజుల్లో గజ్వేల్ కాంగ్రెస్ ఖాళీ అవుతుండగా, తాము అనుకున్న విదంగానే కేసీఆర్ మెజార్టీ లక్ష దాటుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ యువకుల ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ కారణం కాగా, విదిలేని పరిస్థితుల్లోనే యూపీఏ సర్కార్ దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన విషయాన్ని ఎవరూ కాదనలేని సత్యమని తెలిపారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలకు ప్రజలు చుక్కలు చూపిస్తుండగా, టీఆర్‌ఎస్ అమలుచేసిన ప్రజా సంక్షేమ పథకాలే పేదలకు అండగా నిలిచి తిరిగి సర్కార్ ఏర్పాటుకు కారణమవుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పోరేషన్ చైర్మెన్‌లు భూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, జెడ్‌పీటీసీలు సింగం సత్తయ్య, ఎంబరి రాంచంద్రం, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి ఊడెం కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ అధికార ప్రతినిది పండరి రవీందర్‌రావు, రైసస జిల్లా డైరెక్టర్ మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షులు గోపాల్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత తదితరులు పాల్గొన్నారు.