మెదక్

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, నవంబర్ 9: ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని టిఆర్‌ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టం చేసారు. టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ మైనారిటీల సంక్షేమానికి పలు సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టారన్నారు. పటన్‌చెరు మండల పరిధిలోని ఐనోలు, చిన్నకంజర్ల గ్రామాలలో శుక్రవారం టిఆర్‌ఎస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ శంకర్‌రెడ్డి అధ్వర్యంలో బోనాలతో మహిళలు అభ్యర్థికి గ్రామంలోని స్వాగతం పలికారు. గజమాలతో మహిపాల్‌రెడ్డి సన్మానించారు. అనంతరము అభ్యర్థి మాట్లాడుతూ మైనారిటీల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ప్రారంభించిన ఘనత కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలో ఒకే రోజు గురుకులాలను ప్రారంభించి భారతావనిలోనే ఓ నూతన చరిత్రకు నాంది పలికింది టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నారు. పెళ్లీడుకొచ్చిన మైనారిటీ ఆడపిల్లలకు షాదిముబారక్ పేరిట 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వారి మనసులలో శాశ్వత స్థానం సంపాదించారన్నారు. ఈసారి జరగనున్న శాసనసభ ఎన్నికలలో ముస్లిం సోదరుల ఓట్లు మెజారిటి స్థాయిలో టిఆర్‌ఎస్ పార్టీ ఖాతాలోనే జమ అవుతాయని గూడెం మహిపాల్‌రెడ్డి జోస్యం పలికారు. కాంగ్రెస్, టిడిపిలను ఏవగించుకుంటున్న మైనారిటీలు టిఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పటన్‌చెరు మండల పరిషత్ అధ్యక్షుడు గొల్ల శ్రీశైలంయాదవ్, చిన్నకంజర్ల ఎంపిటిసి గాయత్రి లక్ష్మిపతియాదవ్, అంతిరెడ్డిగారి అంతిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.