మెదక్

ఫోలింగ్‌పై ప్రతి ఒక్కరికి అవగాహాన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెఢ్డి టౌన్, నవంబర్ 9: పోలింగ్ ప్రక్రియపై ప్రతి ఒక్కరికి అవగాహాహన ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.హన్మంతరావు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాక్‌పోల్ నిర్వహించారు. మాక్ పోలింగ్‌లో కలెక్టర్ హన్మంతరావు, జాయింట్ కలెక్టర్ నిఖిల, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఓటు వేసారు. పోలింగ్ కేంద్రంలో ఉండే అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు పూర్తిస్థాయి పోలింగ్ నిర్వహించారు. కలెక్టర్ సహ అందరూ క్యూలైన్లలో వెళ్లి ఓటు వేసి, వేసిన ఓటును వీవీప్యాట్‌లో చూసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో పోలింగ్‌కు సంబంధించిన ప్రక్రియపై కూడా ఓటరుకు అవగాహాన ఉండడం అంతే ముఖ్యమన్నారు. పోలింగ్ పిఓగా కలెక్టరేట్ ఏఓ గుండెరావు, సిబ్బందిగా కిశోర్, రమేష్, విశే్వశ్వర్లు, ఏజెంట్లుగా కార్తీక్, వెంకటరమణాచారి తదితరులు పాల్గొన్నారు.