శ్రీకాకుళం

ప్రాథమిక దశ నుంచి చట్టాలు పట్ల చైతన్యం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, నవంబర్ 9: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే చట్టాలు పట్ల చైతన్యం కలిగి ఉండాలని రాజాం సీనియర్ సివిల్ జడ్జి స్వాతి కోరారు. శుక్రవారం స్థానిక బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విధులు సంరక్షించుకొనేందుకు చట్టాలు ఎంతో అవసరమని, ప్రతి చట్టం మన హక్కులను కాపాడుతుందనే భావం విద్యార్ధి దశ నుంచే కలిగి ఉండాలని కోరారు. ఆమెతో పాటు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చల్లా శ్యామ్‌ప్రసాద్, విజయకుమార్, జడ్డు అప్పలనాయుడు తదితరులున్నారు.
పైడికొండల గృహనిర్బంధం పట్ల బీజేపీ నిరసన
రాజాం, నవంబర్ 9: రాష్ట్ర మాజీ మంత్రి, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తరావల్లి మోహనరావు, పద్మావతి తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తూ నిర్బంధం చేయడం సిగ్గుచేటన్నారు.
పరిహారంపై సర్వే పక్కాగా ఉండాలి
సోంపేట, నవంబర్ 9: తిత్లీ తుపాన్ సందర్భంగా ఆస్తి, ఇళ్లు కోల్పోయిన బాధితుల పరిహారం అందించడంలో సర్వేలు పక్కాగా జరిపి బాధితులందరికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను పలువురు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాసరావు అధ్యక్షతన సర్వసభ్యసమావేశంలో తుపాన్‌కు సంబంధించి బాధితులను ఆదుకోవాలనే విషయమై సభలో చర్చించారు. బాధితులను ఆదుకోవడంలో సీ ఎం దేశంలోనే రికార్డు సృష్టించారని, మొదటి విడత బాధితులకు చెక్కులు పంపిణీలో వేర్వేరు ప్రాంతాలు నుంచి వచ్చిన అధికారుల నిర్లక్ష్యం వల్ల అస్తవ్యస్తంగా మారిందని, గతాన్ని మరిచి ఇప్పటికి దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగేలా గ్రామాలకు, స్థానిక అధికారులను పంపి పూర్తిస్థాయిలో సర్వే జరిపించాలని గొల్లవూరు, పలాసపురం సభ్యులు నాగభూషణం, జోగారావు, పట్నాయక్, ఎం.నాగేశ్వరరావులు కోరారు. అటవీశాఖసిబ్బంది నిర్లక్ష్యంపై జడ్‌పిటీసీ సభ్యుడు చంద్రమోహన్ అసంతృప్తి వ్యక్తం చేసారు. పక్కాగా నష్టం నమోదు వివరాలను సేకరించాలన్నారు. చాలా ప్రాంతాల్లో సర్వే అస్తవ్యస్తంగా మారి అనర్హుల చేతికి నష్టపరిహారం అందిందని, దీనితో అర్హులైనవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు సభ్యులు అధికారులు ముందు ఉంచారు. దీనిపై స్థానిక తహసీల్థార్ గోపాలరత్నం మాట్లాడుతూ స్థానికేతరులు సర్వేలు జరపడం వల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనాయని, ఇక నుంచి పక్కాగా సర్వే జరిపి నిజమైన లబ్దిదారులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీవో ఈశ్వరమ్మ, అధికారులు పాల్గొన్నారు.
పొందరలను ఆదుకోవాలి
మెళియాపుట్టి, నవంబర్ 9: అన్ని రంగాల్లో వెనుకబడి వున్న పొందర కులస్తుల అభివృద్ధి కోసం ఆదుకోవాలని పొందరసంక్షేమ సంఘం ప్రతినిధులు బి. ఆనంద్‌తోపాటు కులస్తులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కె.వెంకటరమణమూర్తిని ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందించారు. పొందరలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు. పొందరలకు ప్రత్యేక భజనమండలి భవనం మంజూరుచేయాలని ఎమ్మెల్యేను కోరారు. అర్హులైన పొందరలకు పింఛన్లు, కాలనీలు, పథకాలు అందించి పొందరలను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పొందరకులస్తులు నిరంజన్, బృందావన్, కృష్ణనాయక్, పూర్ణ, జగదీష్‌పాత్రో తదితరులు పాల్గొన్నారు.

కొత్తమ్మతల్లి ఆదాయం రూ.3.34 లక్షలు
కోటబొమ్మాళి, నవంబర్ 9: స్థానిక శ్రీ కొత్తమ్మతల్లి దేవస్థానంలోని ధర్మహుండీలను శుక్రవారం లెక్కించగా, 3 లక్షల 34 వేల 412 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ మేనేజరు వి.రాధాకృష్ణ తెలిపారు. 28 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందని తెలిపారు. ఉత్సవాలు అయిన తర్వాత రెండవసారి లెక్కించిన హుండీ ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్ర