క్రైమ్/లీగల్

సామాజిక తనిఖీలో బయటపడ్డ లొసుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, నవంబర్ 9: రాజాం మండలానికి సంబంధించి 1-10-2017 నుంచి 31-3-2018 వరకు నిర్వహించిన ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి 11వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి రూ.2 కోట్ల 95 లక్షల 67 వేల 42, అలాగే వెలుగుకు సంబంధించి రూ.16 లక్షల 42 వేల 229, ఫారెస్ట్ విభాగానికి సంబంధించి రూ.27,450, ఎన్టీ ఆర్ హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించి రూ.91 లక్షల 62,935, పశుసంవర్ధకశాఖకు సంబంధించి రూ.6 లక్షల 76,405, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి రూ.81 లక్షల 82 వేల 106, పింఛన్లకు సంబంధించి రూ.6,750 తనిఖీల నివేదికలు సమర్పించారు. అయితే ప్రతి గ్రామంలో ప్రభుత్వపరంగా నిర్వహించిన పనుల్లో అనేక లొసుగులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి సామాజిక తనిఖీ అధికారి ఆర్.వెంకటరామన్ మాట్లాడుతూ లొసుగులకు పాల్పడే వారిపై చర్యలు తప్పవన్నారు. వారి నుంచి రికవరీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ ఎల్.అప్పలసూరి, ఎంపీడీవో బి.వెంకటేశ్వరరావు, అధికారులు ఎస్.శ్రీరాములు, సత్యనారాయణ, ఎం. ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

రాజాం, నవంబర్ 9: రాజాం మండలం అంతకాపల్లి గ్రామానికి చెందిన వల్లూరు రాజేశ్వరి (24) అనే వివాహిత ఈ నెల 5వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె భర్త సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై ఏ ఎస్ ఐ నారాయణ కేసు నమోదు చేశారు. 2014లో వివాహమైన రాజేశ్వరి దంపతులు విశాఖపట్నం ఎన్ ఏడీ కొత్త రోడ్డులో నివసిస్తూ ఇటీవల అంతకాపల్లి చేరుకొని తిరుగు ప్రయాణమయ్యే సమయంలో మరుగుదొడ్డికి వెళతానని చెప్పి రాకపోవడంతో బంధువుల ఇళ్లల్లో వెతికామని, అయినా ఫలితం చిక్కకపోవడంతో ఫిర్యాదు చేసినట్టు ఆమె భర్త తెలిపారు.