శ్రీకాకుళం

తిత్లీ తుపాన్ బాధితులకు అందని సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, నవంబర్ 9:తిత్లీ తుపాన్ ధాటికి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారం, సహాయం అందలేదని వివిధ ప్రజాసంఘాల నిజనిర్థారణ కమిటీ వెల్లడించింది. శుక్రవారం బొడ్డపాడులో అమరవీరులస్మారక సంఘం, వివిధ ప్రజా సంఘాల నాయకులు సమావేశమైనారు. తిత్లీ తుపాన్ ధాటికి తీరప్రాంతంతోపాటు 7 మండలాల్లో వందలాది గ్రామాలు విధ్వంసానికి గురికావడంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం అందించే సహాయకచర్యలను అడిగి తెలుసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతాన్ని గత కొంతకాలంగా కిడ్నీ భూతం భయపెడుతుంటే తిత్లీ తుపాన్ మరింత అతలాకుతలం చేసిందని, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. తుపాన్ కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు 20 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, ఉద్దానంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి, ప్రతి మండలంలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేయాలని కోరారు. ఇళ్లు కోల్పోయిన గిరిజనులకు తక్షణమే పక్కా ఇళ్లు నిర్మించాలని, జీడి,కొబ్బరి ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున పదేళ్లుపాటు నష్టపరిహారం చెల్లించాలని, ఏడాదికి ప్రతి కుటుంబానికి ఉచితంగా గ్యాస్, విద్యుత్తును సరఫరా చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రజాకళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.కోటి, పిడి ఎం రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వరరావు, సీ ఎబి ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు బి.అంజమ్మ, కె ఎన్‌పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, కెన్‌పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, అన్నపూర్ణ, నాగేశ్వరరావు, ప్రసాద్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక, రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సిద్దపడాలి
పలాస, నవంబర్ 9: బీజేపీకి కాంగ్రెస్ పార్టీ, టీడీపీకి వైసీపీ పార్టీ లేదా మరో బూర్జవాపార్టీలు ప్రత్యామ్నాయాలు కావని, ప్రజలకు ఆర్థిక పరిపుష్టితను ఇచ్చే ప్రత్యామ్నాయవిధానాలు కావాలని, అందుకు ప్రజలంతా సిద్దంకావాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం కాశీబుగ్గలోని సీపీ ఎం నాయకులు ఆనందరావు అధ్యక్షతన సీపీ ఎం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చి, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతోపాటు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కార్మికచట్టాలు హక్కులను కాలరాస్తున్నారని, ప్రభుత్వరంగ వైద్య, విద్యలతోపాటు బ్యాంకింగ్, రైల్వే రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు కోసం అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ ఎం నాయకులు మోహన్, ఎన్.గణపతి, ఎన్.కోదండరావు, కె.బాలాజీ, సుగుణ, బి.్భనుమతి, ఈశ్వరమ్మ, భాగ్యం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సురేష్
ఇచ్ఛాపురం, నవంబర్ 9 : రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో పాల్గొననున్న జిల్లా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పట్టణానికి చెందిన సురేష్‌కుమార్ సాహు ఎంపికయ్యాడు. ఈ నెల 11 నుంచి 3 రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో ప్రతిభ చూపినవారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారని ఇచ్ఛాపురం క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు దాసరి రాజు, కోచ్ డి.గోపి తెలిపారు. పోటీలలో పాల్గొనేందుకు శుక్రవారం పయనమైన సురేష్‌కు అభినందనలు తెలిపారు. క్లబ్ కార్యదర్శి రాము పట్నాయక్, మేనేజర్ ఎస్.చిరంజీవి, జిల్లా జట్టు సెలెక్టర్ సురేంద్ర గౌడో పాల్గొన్నారు.

నిర్మాణ పనులు వేగంగా చేయాలి
ఇచ్ఛాపురం, నవంబర్ 9 : పట్టణంలోని వివిధ వార్డులలో చేపట్టిన అభివృధ్ధి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. పురుషోత్తపురం షిర్డిసాయి మందిరానికి నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించబోమని స్పష్టం చేశారు. కౌన్సిలర్ ఎస్.ప్రేమ్‌కుమార్, వైసీపీ నేతలు పి.దేవరాజు రెడ్డి (సంతు), ఎం.వెంకటరెడ్డి పాల్గొన్నారు.

అంబుసోలిలో సరస్వతి విగ్రహావిష్కరణ
పలాస, నవంబర్ 9: అంబుసోలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సరస్వతిదేవి విగ్రహాన్ని వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆవిష్కరించారు. పాఠశాల పూర్వ విద్యార్థి డి.రంగారావు సహకారంతో గ్రామస్తుల సౌజన్యంతోపాటు స్థానిక కౌన్సిలర్ మీసాల సురేషు కృషితో సరస్వతిదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో ఏదైనా దొంగతనం జరగవచ్చునని, విజ్ఞానం చోరీకి గురికాదని, విజ్ఞానంతోనే ఉన్నత అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం రోహిణి, కె.సావిత్రి, ఎం.శారద, టి.మధుసూదనరావు, పి.విజయ, చిన్ని, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలి
పలాస, నవంబర్ 9: గర్బిణీలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాకాలను అందిపుచ్చుకోవాలని పలాస ప్రభుత్వాసుపత్రి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పలాస ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ కార్యక్రమాన్ని నిర్వహించి బాలింతలకు సురక్ష ఎన్‌టి ఆర్ బేబీ కిట్‌లను అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస ప్రభుత్వాసుపత్రిలో నిపుణులైన వైద్యులు ఉన్నారని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సేవలు అందిస్తున్నామని, గర్బిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని, క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటే సుఖప్రసవం అవుతుందన్నారు. బాలింతలకు బిడ్డతోసహా సురక్షితంగా తల్లీ,బిడ్డ సంరక్షణ వాహనంలో వారిని ఇంటి వద్ద దింపుతామన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అయిన వారికి ప్రభుత్వం ప్రత్యేక నజరానా అందిస్తుందని, ఉచితంగా మందులను అందజేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి అవకాశాలు కేవలం ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే ఉంటాయని, ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించి వేలాది రూపాయలు దుబారా చేయవద్దు అని, ప్రభుత్వాసుపత్రిలో అంతా ఉచితమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకాశ్‌వర్మ, వైద్యురాలు స్వరాజ్యలక్ష్మి, వైద్యసిబ్బంది శివప్రసాద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.