కడప

రేపటి నుండి అన్నమయ్య నడిచి వెళ్ళిన మార్గంలో మహాపాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, నవంబర్ 15: శ్రీ వెంకటేశ్వరునిపై 32వేల సంకీర్తనార్చన చేసిన తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్ళిన మార్గంలో తిరుమలకు మహాపాదయాత్ర 16వ మారు శనివారం నుండి చేపట్టనున్నట్టు రాజంపేట పార్లమెంటరీ వైసీపీ ఇన్‌ఛార్జి ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అన్నారు. గురువారం రాజంపేటలోని ఆకేపాటి భవన్‌లో ఆయన మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం ఆకేపాడు ఆలయాల సముదాయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణోత్సవాన్ని మహాపాదయాత్రకు ముందుగా నిర్వహిస్తున్నామన్నారు. మహాపాదయాత్రలో వేల సంఖ్యలో గోవిందమాలలు ధరించి భక్తులు పాల్గొనే అవకాశాలు దృష్టిలో ఉంచుకుని వారికి తిరుమలకు చేరుకునే వరకు భోజనవసతి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అన్నమయ్య నడిచి వెళ్ళినమార్గంలో భక్తులతో కలిసివెళ్ళి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నామన్నారు. అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్ళిన మార్గాన్ని ఎవరూ మరచిపోకుండా ఎంతోకష్టంతో కూడుకున్నడైనప్పటికి ప్రతి యేడు మహాపాదయాత్ర నిర్వహిస్తూ వస్తున్నామని, ఇందుకు ఆ భగవంతుని ఆశీస్సులు తమపై ఉండడమే కారణమన్నారు. అన్నమయ్య భక్త్భివాన్ని భావితరాలకు తెలియజేయాలన్నదే తన సంకల్పమన్నారు. అంతేకాకుండా అన్నమయ్య నడిచి వెళ్ళిన మార్గం అభివృద్ధి చేయాలన్నది కూడా నా మహా సంకల్పంగా చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నమయ్య నడిచి వెళ్ళిన మార్గం అభివృద్ధికి సంబంధించి తామిచ్చిన వినతిపత్రాలపై కొంతవరకు పురోగతి వచ్చినా, వైఎస్ మరణించడంతో ఈ మార్గం అభివృద్ధి కుంటుపడిందన్నారు. అదే విధంగా అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకలో అన్నమయ్య జయంత్యుత్సవాలు కూడా వైఎస్ హయాంలో ప్రపంచస్థాయి గుర్తింపు లభించేలా ఘనంగా నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎప్పటికైనా అన్నమయ్య తిరుమలకు నడిచి వెళ్ళిన మార్గం అభివృద్ధి పరచడమే తన ధ్యేయమన్నారు. తనకు భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకు తిరుమలకు మహాపాదయాత్ర ప్రతి ఏడు నిర్వహిస్తానన్నారు. ఇందువల్ల ప్రజల్లో భక్త్భివం పెరుగుతుందన్నది తన భావన అన్నారు. ఎంతో కష్టంతో కూడుకున్న తిరుమల మహాపాదయాత్రలో ఒకోమారు భారీ వర్షాలు ఎంతో ఇబ్బందికర పరిస్థితులుకూడా తీసుకొచ్చాయని, అడవిలో పెద్దపెద్దవృక్షాలే నేలకూలడం కూడా జరిగిందన్నారు. అయినా ఎలాంటి ఆటంకం లేకుండా వేలాది భక్తులతో తిరుమల మహాపాదయాత్రను విజయవంతంగా ముగిస్తూ వస్తున్నామన్నారు. ఒక సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు మహాపాదయాత్ర తిరుమలకు చేరుకున్న సందర్భంగా వైకుంఠ ద్వారం ద్వారా తనతో పాటు వచ్చిన వేలాది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించడం నా జీవితంలో మరచిపోలేనన్నారు. ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్న తిరుమల మహాపాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా సహకరించి విజయవంతం చేయాలని అమర్‌నాధరెడ్డి కోరారు.