మెదక్

వంద సీట్లు సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, నవంబర్ 16: 2018 సార్వత్రిక ఎన్నికల్లో తెరాస వంద సీట్లు గెలుచుకుంటుందని మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని 3,5,6 వార్డుల్లో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేశారు. డప్పుచప్పులు, కార్యకర్తల నృత్యాల మధ్య పద్మాదేవేందర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కొనసాగింది. ముందుగా 6వ వార్డులోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వార్డులో కౌన్సిలర్ అరునార్తి వెంకటరమణ నాయకత్వం వహించారు. ఈ మూడు వార్డులలో ఏ ఇంటికి వెళ్లినా మహిళలు బొట్టుపెట్టి స్వాగతం పలకడమే కాకుండా శాలువలు కప్పి సన్మానిస్తున్నారు. మరికొన్ని కుటుంభాల్లో తిరిగి మీరే గెలవాలని హారతి ఇస్తున్నారు. ఈ విధంగా మెదక్ పట్టణంలో పద్మాదేవేందర్‌రెడ్డికి ఘన సత్కారం చేస్తూ మీరు విజయం సాధించడానికి మా ఓటును వేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా 5వ వార్డులో కౌన్సిలర్ విజయలక్ష్మీ నాయకత్వంలో ఇంటింటి ప్రచారం జోరుగా సాగింది. అక్కడ పద్మాదేవేందర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ కేసీఆర్ మల్లి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది దశలో నడుస్తుందని ఆమె తెలిపారు. 40 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం 20 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వాలు పాలించినప్పటికీ ఎలాంటి అభివృద్ది జరగలేదని ఆమె ఎద్దేవ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలకు అవసరమైన అభివృద్ది కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల వారు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను చూసి అబ్బురపోయారని ఆమె తెలిపారు. ఈ అభివృద్ది ఆశామాసీ కాదు, కేసీఆర్ అనేక మేధావులతో చర్చించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ వైపుకు మల్లించాలనే కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ అభివృద్ది కార్యక్రమాలు ఏ ఒక్కరితో కావన్నారు. మహాకూటమి మాయ కూటమని ఆమె తెలిపారు. ఈ మాయ కూటమితో ఎలాంటి అభివృద్ది జరగదని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన చంద్రబాబునాయుడితో కాంగ్రెస్ నాయకులు జతకట్టి మహాకూటమిగా ఏర్పాటు అయ్యారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజకుడిగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జతకట్టడం తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదన్నారు. ఈయనకు ఏజెండా లేదు, అభ్యర్థులు దొరకడం లేదు, పోటి చేసే అభ్యర్థులకు ఎన్నికల్లో ఏజెంట్లు కూడా లేరని ఆమె ఎద్దేవా చేశారు. కాగా ఇలాంటి మాయ కూటమికి ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో జాతీయ రహదారులు మంజూరయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ది జరగలేదన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో ఎవరు ఊహించని విధంగా మెదక్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అనేక అభివృద్ది కార్యక్రమాలు సీఎం కేసీఆర్ ద్వారా సంపాదించుకున్న విషయాన్ని ఆమె వివరించారు. కాగా ప్రజలు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని దీవిస్తున్నట్లు తెలిపారు. వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తెరాసను గెలిపించడానికి సంసిద్దంగా ఉన్నారని ఆమె తెలిపారు. మహాకూటమి ఈ ఎన్నికల్లో మాయమైపోతుందని ఆమె స్పష్టం చేశారు. మెదక్ నియోజకవర్గంలో తన విజయాన్ని ఎవరు ఆపలేరని ఆమె తెలిపారు. ఈ ప్రచారంలో జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ నుండి జుబేర్, శ్రీనివాస్ పద్మాదేవేందర్‌రెడ్డి విజయానికి మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా మార్వాడి సమాజ్ సంఘం పపలావ్ ఆధ్వర్యంలో తెరాస అభ్యర్థికి మద్దతు ఇస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రతి ఇంటిలో బొట్టుపెట్టి స్వాగతం పలికారు. మరికొన్ని కుటుంభాల్లో హరతులు ఇచ్చి ఆమెను స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు అరునార్తి వెంకటరమణ, సలామ్, జెల్ల గాయత్రి, విజయలక్ష్మీ, బట్టి సులోచన, చంద్రకళ, గోదల లక్ష్మీ, లక్ష్మీ ముత్యంగౌడ్, నరేష్, జీవన్‌రావు, సంగ శ్రీకాత్, గంగాధర్, నర్సింలు, నరేంద్ర మాయ మల్లేశం, శివ, సంతోష్, సతీష్, రాధా గోవింద్ తదితరులు పాల్గొన్నారు.