కరీంనగర్

జిల్లాలో ఇప్పటివరకూ రూ.1.72 కోట్ల సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 16: జిల్లాలో జరుగు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లైయింగ్ బృందాలు, చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలో ఇంతవరకు రూ.1.72 కోట్ల నగదు, 9.655 కిలోల వెండి, 2.585 కిలోల బంగారం, 400 చీరలు పట్టుకున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వారి ఛాంబర్‌లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సరియైన ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును, బంగారం, వెండిని పట్టుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో పట్టుకున్న నగదును, బంగారం, వెండిని సంబంధిత వ్యక్తులు సరియైన ఆధారాలు సమర్పిస్తే జాయింట్ కలెక్టర్ అండ్ నోడల్ అథారిటీ అధ్యక్షతన గల జిల్లా స్థాయి కమిటీలో ప్రతి మంగళవారం, శుక్రవారం ఆధారాలను పరిశీలించి తిరిగి వారికి కమిటీ ద్వారా నగదు గాని బంగారం, వెండిని అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో 11 కేసులు పరిశీలించి రూ.15,96,690 వారికి తిరిగి అప్పగించామని తెలిపారు. అలాగే 400 చీరలు కూడా తిరిగి ఇచ్చేశామని చెప్పారు. జిల్లాలో ఇంతవరకు 67 కేసులు బుక్ చేశామని అన్ని కేసులను కమిటీలో పరిశీలించి విడుదల చేశామని తెలిపారు. అధికారులు పట్టుకున్న నగదులో సరియైన లెక్కలు చూపని 28,36,800 నగదును ఇన్‌కం టాక్స్ అధికారులు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు క్రీడా పోటీలు
డిసెంబర్ 3, 2018 దివ్యాంగుల (మానసిక వికలాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు) దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నామని జేసీ తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్న క్రీడా పోటీలకు సన్నాహక ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ క్రీడా పోటీలు నిర్వహించుటకు కావలసిన వ్యాయామ ఉపాధ్యాయులు, పోటీల విజేతలకు అందించాల్సిన ప్రథమ, ద్వితీయ బహుమతులు, సర్ట్ఫికేట్లు, భోజనాలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ అధికారులతో చర్చించారు. 18 సంవత్సరాల లోపు విద్యార్థులను జూనియర్లుగా, 18 సంవత్సరాల పైబడిన వారిని సీనియర్లుగా గుర్తించి క్రీడా పోటీలు జరుపుతారని తెలిపారు. ఏయే అంశాల్లో పోటీలు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని అన్నారు.

టీఆర్‌ఎస్‌ని వీడిన మానకొండూర్ ఎంపీపీ
మానకొండూర్, నవంబర్ 16: మానకొండూర్ ఎంపిపి మాతంగి లింగయ్య టీఆర్‌ఎస్ పార్టీ విడి టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సమక్ష్యంలో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరిన్నారు. మానకొండూర్ ఎంపిపి లింగయ్యతోపాటు ఈదులగట్టపల్లి గ్రామాశాఖ రైతు సమన్వయ అధ్యక్షడు దాసరి రాఘవరెడ్డి, తిమ్మాపూర్ ఎంపిటీసి సింగిరెడ్డి స్వామిరెడ్డిలు టీఆర్‌ఎస్ పార్టీని విడి టీపిసిసి ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్ ఆరెపల్లి మోహన్, కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్‌లోటీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరిన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎంపిపి లింగయ్యకు పార్టీ కండువ కప్పి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీలో చేరిన్నట్లు తెలిపారు.