క్రైమ్/లీగల్

మడ్డువలస డ్యామ్‌లో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంగర, నవంబర్ 17: మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు ప్రధాన గేట్లు దిగువ భాగం బకెట్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తూ పడి మృతి చెందిన సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర విషాధాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామతేజ (19), విజయనగరం పట్టణానికి చెందిన మల్లెల వెంకట దినకర్‌సాయికిరణ్ (19)లు రాజాంలోని జీ ఎం ఆర్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్నారు. వీరిద్దరూ శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు దిగువ భాగంలో గల బకెట్ పోర్సన్ వద్ద సెల్ఫీ తీసుకున్న సమయంలో ప్రమాదవశాత్తూ కాలుజారి అత్యంత లోతుగా ఉన్న నీటిలో మునిగి చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. రామతేజ తండ్రి జగదీశ్వరరావు రాజాం జూనియర్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. కిరణ్‌తండ్రి ఫణీంద్రకుమార్, తల్లి శివపార్వతి ఇద్దరూ ఉద్యోగులే. ప్రస్తుతం సెలవులు అయినప్పటికీ సాయికిరణ్ కళాశాలలో ఉన్న లైబ్రరీలో పుస్తకాలు మార్చడానికి వచ్చినట్టు తల్లిదండ్రులు తెలిపారు. స్నేహితుడైన రామతేజతో కలిసి ద్విచక్ర వాహనంపై మడ్డువలస ప్రాజెక్టుకు శుక్రవారం చేరుకున్నారు. ఎంత రాత్రి అయినప్పటికీ ఇద్దరు విద్యార్థులు ఇంటికి చేరకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పిల్లల ఆచూకీ కోసం ఎన్ని ఫోన్లు చేసినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి శుక్రవారం రాత్రే మడ్డువలస ప్రాజెక్టు వద్దకు చేరుకొని ఒడ్డుపై ఉన్న ద్విచక్ర వాహనాలను చూసి కుప్పకూలిపోయారు. వీరిరువురు విద్యార్థులు ప్రాజెక్టులో పడి మృతి చెందినట్టు భావించి వారి మృతదేహాల కోసం పోలీస్ సిబ్బంది మత్య్సకారులైన కొట్టిశ సీతారామ ఫిషరమెన్ సొసైటీ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజాం రూరల్ సీ ఐ వీరకుమార్, వంగర ఇన్‌చార్జి ఎస్ ఐ ఆర్.జనార్థనరావు, తహశీల్దార్ జి.మంగు, ఆర్ ఐ వెంకటరమణ ఆధ్వర్యంలో శవపంచనామా జరిపి పీ ఎం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీ ఐ తెలిపారు.