రంగారెడ్డి

శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, నవంబర్ 18: స్వర భారతి ఫౌండేషన్‌లో శిక్షణ పొందుతున్న నృత్య కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం ప్రదర్శన అలరించింది. ఘం గణపతియే, బ్రహ్మంజలి, గజాననం, శారదాస్తుతి, అంశాలను కూచిపూడి శైలిలో పుషాంజలి, నర్తన గణపతిం, థిల్లాన, అలరింపు అంశాలను భరత నాట్య శైలిలో ప్రదర్శించి కనువిందు చేశారు. భారతీయ కళా సంస్కృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీతారాధన ఆకట్టుకుంది,
నిబంధనలు బేఖాతర్
సైదాబాద్, నవంబర్ 18: ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. నియోజకవర్గాల నుండి పోటీకి దిగే ప్రధాన పార్టీలు. స్వతంత్ర అభ్యర్థులూ తమ పూర్తి వివరాలు నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడించారు. ఏ ప్రభుత్వ శాఖకు బకాయి పడి ఉండకూడదు. కానీ, మలక్‌పేట నియోజకవర్గ ప్రధాన పార్టీల అభ్యర్థులు, తాము నగర ట్రాఫిక్ పోలీస్ శాఖకు బకాయిపడ్డ జరిమానా వివరాలు వెల్లడించలేదు. ఆ జరిమానాలు ఇప్పటికీ ఇంకా చెల్లించలేదు. నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే మజ్లీస్ అభ్యర్థి అహ్మద్ బిన్ బలాల, భాజపా అభ్యర్థి ఆలె జితేంద్రలు తాము సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తమ చర ఆస్తులుగా పేర్కొన్న వాహనాలకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వలన జరిమానా చలాన్లు బకాయి పడి ఉన్నారు. మజ్లీస్ అభ్యర్థి బలాల అఫిడవిట్‌లో తన కారు నెంబరు ఏపీ12హెచ్2688కు నగరంలోని పలు ట్రాఫిక్ పోలీస్ ఠాణాల పరిధిలో ఆరు సార్లు చలాన్లు విధించబడి మొత్తం రూ.1075 జరిమానా బకాయి ఉన్నారు. భాజపా అభ్యర్థి ఆలె జితేంద్ర పేర్కొన్న తన కారు నెంబరు ఏపీ 28సీసీ 0111కు చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ ఠాణా పరిధిలో చలాన విధించబడి రూ.135ల జరిమానా ట్రాఫిక్ వారికి బకాయి పడి ఉన్నారు.

వడ్డెరుల సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయం

జీడిమెట్ల, నవంబర్ 18: వడ్డెరుల సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్ అన్నారు. గాజులరామారంలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో నియోజకవర్గం వడ్డెర సంఘం కార్తీక మాస వనభోజన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా కేపీ వివేక్ విచ్చేశారు. వడ్డెర సంఘం కులస్థులంతా వివేక్‌కు మద్దతు తెలిపి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వడ్డెరులు హామీ ఇచ్చారు. వివేక్ మాట్లాడుతూ వడ్డెర సోదరులకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతే భవిష్యత్ బాగుపడిందని, సమగ్ర వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం ప్రతినిధులు ఎత్తరి మారయ్య, ఇరుదిండ్ల శ్రీనివాస్, మంజునాథ్, ఇరుదిండ్ల వెంకటేశ్, గిరిబాబు, గుంజా మహంకాళి, సాంబయ్య, పూజారి, కాశీ, హన్మయ్య, ఎల్లయ్య, నగేశ్, తిమ్మయ్య, యాదగిరి, తిరుపతి, మహేశ్, అఖిల్, లక్ష్మయ్య, రాము, దశరథ్ పాల్గొన్నారు.
నిజాంపేట్‌లో ముమ్మర ప్రచారం
బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట్ గ్రామంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్ ముమ్మర ప్రచారం చేశారు. గ్రామంలోని పలు కాలనీలలో, గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని మల్లంపేట్, గాగిల్లాపూర్ గ్రామాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. కాలనీలు, గ్రామాలలో పాదయాత్ర చేసి కరపత్రాలను పంచుతూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని వివేక్ అభ్యర్థించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ కవిత, నాయకులు దన్‌రాజ్, సాయిలు, నాగేశ్ చారి, అభిషేక్, సురేశ్ రెడ్డి, మంజునాథ్, జగన్, చౌదరి పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌ను గెలిపించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి
టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు. చింతల్ డివిజన్ ఎర్రగోడల్‌లోని వైఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో డివిజన్ తెరాస అధ్యక్షుడు మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ టీఆర్‌ఎస్ సమావేశం జరిగింది. సమావేశానికి రాజు, టీఆర్‌ఎస్ నేత కేఎం ప్రతాప్‌లు ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యకర్తలకు కిట్‌లను అందజేశారు. అనంతరం కాంగ్రెస్, టీడీపీకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. రాజు, ప్రతాప్ మాట్లాడుతూ బూత్ స్థాయి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను చైతన్య పరిచి ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేయాలని అన్నారు. కార్పొరేటర్ సత్యనారాయణ, నాయకులు నాగరాజు, బాలరాజ్, మాధవ రెడ్డి పాల్గొన్నారు.
వివేక్‌ను గెలిపించడమే ధ్యేయం...
కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్‌ను గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ముదిరాజ్ సంఘం నాయకుడు ఆగం రాజు అన్నారు. బాచుపల్లి గ్రామం మా విల్లాస్ కాలనీలో రాజు ముదిరాజ్ సమక్షంలో పెద్దఎత్తున నాయకులు, యువకులు, కాలనీ వాసులు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో శేఖర్, గిరిబాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
గాజులరామారం సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ జగన్ ఆధ్వర్యంలో అంజయ్యనగర్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్‌ను గెలిపించేందుకు ముమ్మర ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు జైహింద్, వేణుగోపాల్, సురేశ్, పాల శ్రీను, బొగ్గుల సురేశ్, అశోక్, మహంకాళి, సాంబయ్య, మహమూద్, మహేందర్, ఇందిరా, హజ్త్ అలీ పాల్గొన్నారు.