క్రైమ్/లీగల్

నమ్మిన ఇంటికే కన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, నవంబర్ 18: నమ్మి ఉద్యోగం ఇచ్చిన ఇంట్లోనే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. డ్రైవర్‌గా పనిచేసూ యజమాని ఇంట్లోని రూ.75 లక్షల నగదును అపహరించి కటకటాల పాలైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం పేట్‌బషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను బాలానగర్ జోన్ డీసీపీ పద్మజా, ఏసీపీ శ్రీనివాస్ రావు, పేట్‌బషీరాబాద్ సీఐ మహేశ్ వెల్లఢించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన జల బాపురెడ్డి వృత్తిరీత్యా వైద్యుడు. నిజామాబాద్‌లో డాక్టర్‌గా పనిచేస్తుంటాడు. వీకెండ్‌లో మాత్రం కొంపల్లిలోని మికాస స్టెర్లింగ్‌లోని విల్లా నంబరు 13లో నివసిస్తాడు. నిజామాబాద్, గౌతమ్‌నగర్‌కు చెందిన మనె్నం రవికుమార్(33) డ్రైవర్‌గా పనిచేస్తాడు. రవికుమార్ బాపురెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సిద్దిపేట, కొత్తూరులో ఉన్న తన స్థలాన్ని ఈనెల 16న బాపురెడ్డి విక్రయించాడు. రూ.75 లక్షలు లెక్కించే సమయంలో డ్రైవర్ రవికుమార్ గమనించాడు. డబ్బులను తీసుకువచ్చి కొంపల్లిలోని తన విల్లాలో బాపురెడ్డి దాచిపెట్టాడు. అది గమనించిన రవికుమార్‌కు దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా డబ్బులను అపహరించాలని పన్నాగం వేసుకున్నాడు. అదే రోజు సాయంత్రం బాపురెడ్డి కుటుంబ సభ్యులను ఓ ఫంక్షన్‌కు కాలనీలోని నైబర్స్ ఇంటికి వెళ్లారు. కాగా బాపురెడ్డి అల్వాల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. బాపురెడ్డిని అల్వాల్‌లో కారులో వదిలిపెట్టి తిరిగి కొంపల్లి విల్లాకు చేరుకున్నాడు. ఇంట్లోకి చొరబడిన డ్రైవర్ రవికుమార్ రూ.75 లక్షల నగదు బ్యాగ్‌ను తీసుకుని అదే ఇంటి పైకప్పుపై దాచిపెట్టాడు.
నగదును దాచిపెట్టిన కబోర్డ్‌లో డబ్బులు కనిపించకపోవడంతో బాపురెడ్డి.. పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసుకున్న పోలీసులు అనుమానితుడైన డ్రైవర్ రవికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు విషయం బయటపడింది. రూ.75 లక్షల నగదును స్వాధీనం చేసుకుని రవికుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. డీసీపీ పద్మజ మాట్లాడుతూ గేటెడ్ కమ్యునిటీ కాలనీల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఆధారంతో నిందితులను సులువుగా పట్టుకోవచ్చని చెప్పారు.