మెదక్

సామాజిక న్యాయం కోసం పోరాడేవారిని గెలిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, టౌన్, నవంబర్ 18: సామాజిక న్యాయంకోసం పోరాటం చేసిన వారిని గెలిపించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. ఆదివారం సీపీఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.రాంచందర్‌కు మద్దతుగా ఆయన జహీరాబాద్‌లో నిర్వహించిన ప్రచార సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జతీయ రహాదారిపై కుమార్ హోటల్ ముందు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు పెట్టిన కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు. గతంలో టీడీపీ పార్టీ ముందస్తు ఎన్నికల్లో పరాజయం పాలైందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ప్రజలు బుద్దిచెబుతారన్నారు. కార్మికులకు మోసంచేసి యాజమాన్యాలకు తొత్తుగా కేంద్ర ప్రభుత్వం మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు చట్టాల సవరణ పేరుతో కార్మికులకు మోసం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కూడా అదేబాటలో నడుస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సుప్రీం కోర్టులో నిర్వీర్యం చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదన్నారు. కేసీఆర్ అగ్రకులాలకు తొత్తుగా మారారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉపరాష్టప్రతి పదవికి మద్దతుగా కేసీఆర్ కేంద్రానికి మద్దతుపలికారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రిజర్వేషన్లు 50శాతం మించకుండా ఉండాలని గట్టిగా చెప్పిన ఘనత సీపీఎం పార్టీదేనన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తాననిచెప్పి ఎన్నికల్లో గెలిచి ఆ వర్గాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దళితులపై దాడులు జరిగినా ఏ పార్టీకూడా పట్టించుకోలేదన్నారు. వారికి 3 ఎకరాలిస్తామని రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇవ్వలేదన్నారు. కార్మికుల గురించి పోరాడే పార్టీ సీపీఎం పార్టీ అన్నారు. దళిత, గరిజన, మైనార్టీలకు బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులు చేశారన్నారు. సారా, బిర్యానీలకు ఓటును అమ్ముకోరాదన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేవారికే ఓటు వేయాలన్నారు.
గ్రామాల్లో తిరిగి ఓటు వేయించాలి
సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు మాట్లాడుతూ గ్రామ గ్రామాల్లో తిరిగి సీపీఎం పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరాలని నాయకులకు సూచించారు. టీఆర్‌ఎస్ పార్టీతో తెలంగాణ రాలేదని, అన్ని పార్టీల ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. లక్ష ఉద్యోగాలిస్తామని, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని సీఎం కేసీఆర్ విస్మరించారన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి కె.రాజయ్య మాట్లాడుతూ నీతి నిజాయితీ గల పార్టీ సీపీఎం పార్టీ అన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు లేవన్నారు. సీపీఎం పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్టీ అభ్యర్థి బి.రాంచందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనేక సమస్యలపై పోరాడిన ఘనత సీపీఎం పార్టీదన్నారు. కార్మికులవేతనాలు, నిమ్జ్ భూములు, దళితులపై దాడులు, గ్రామాల్లోని భూ సమస్యలపై పోరాడామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పట్టించుకుని, అభివృద్ధికి తోడ్పడే నాయకునికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డివిజన్ కార్యదర్శి మహిపాల్, మహీంద్రా కార్యదర్శి రాజిరెడ్డి, ఫిరమొల్ కార్యదర్శి నర్సయ్య, రాకూల్ కార్యదర్శి నర్సింహారెడ్డి, వివిధ మండలాల కార్యదర్శులు చంద్రయ్య, సలీమ్, ప్రకాష్, సంగయ్య, వంశీకృష్ణ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం సభకు హాజరవుతున్న పొలిట్ బ్యూలో సభ్యులు బీవీ.రాఘవులను అతిథి హోటల్‌వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి భారీ బైక్‌ర్యాలీద్వారా జాతీయ రహాదారిపై కుమార్ హోటల్‌వరకు సాగింది. మధ్యలో అంబేద్కర్ విగ్రహానికి పూలామాలలువెసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రహాదారి పొడవునా సీపీఎం, రాంచందర్ జిందాబాద్, రాఘువులు, చుక్కారాములు నాయకత్వం వర్దిల్లాలి అంటూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినిదాలు చేశారు. సభావేదకకు చేరుకున్న అతిథులకు స్థానిక నాయకులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.