విజయనగరం

1/17 చట్టాన్ని పకడ్భందీగా అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుమ్మలక్ష్మీపురం, నవంబర్ 19: మండలంలో 1/17 చట్టాన్ని పకడ్భందీగా అమలుచేయాలని ఉత్తరాంధ్రా ఆదివాసీ చైతన్యసేవా సంఘం అధ్యక్షులు ఆరిక సూర్యనారాయణ అన్నారు. ఈమేరకు తహశీల్దార్ సత్యనారాయణమూర్తికి సోమవారం వినతిపత్రాన్ని అందించారు. మండలంలో 1/17 చట్టం అమలులో ఉన్నప్పటికీ గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌పేట, తదితర గ్రామాల్లో విలువైన భూములను గిరిజనేతరులు ఆక్రమిస్తున్నారని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. భూములను ఆక్రమిస్తున్న గిరిజనేతరులపై అట్రాసిటీ కేసులు నమోదుచేసి ఆ భూములకు గిరిజనులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సోమేశ్వరరావు, ఎరకయ్య, రామయ్య, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ అభివృద్దిని చూసి పార్టీలోకి వలసలు
* ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి
లక్కవరపుకోట, నవంబర్ 19: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి వలసలు వస్తున్నారని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. సోమవారం తలారీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ముమ్మన మాధవ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఎమ్మెల్యే లలితకుమారి, టీడీపీ ఇన్‌ఛార్జ్ రాంప్రసాద్‌లు పార్టీ కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు. ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ టీడీపీ చంద్రబాబు పరిపాలనలో జరిగిన అభివృద్ధి ముందు ఎన్నడు జరగలేదని, ఆర్థికలోటు ఉంటు కేంద్రంతో తెగదెంపులు చేసుకుని ఒంటరిగానే రాష్ట్రాన్ని చంద్రబాబుఅభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఇతను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మిగిలిన రాష్ట్రాలు ముక్కున వేలేసుకుంటున్నాయని, అలాగే రాష్ట్రంలో ఇతర పార్టీ నాయకులు కూడా టీడీపీలోకి చేరేందుకు వలస వస్తున్నారని పార్టీలో చేరిన వారికి సముచిన స్థానం, న్యాయం జరుగుతుందని చేరిన వారికి హామీ ఇచ్చారు.

ఉద్యాన వన పంటలపై
రైతులకు అవగాహన అవసరం:జెడి
లక్కవరపుకోట, నవంబర్ 19: రాష్ట్రంలో ఉద్యాన వన పంటలపై రైతులకు పూర్తి అవగాహన ఉండాలని, అప్పుడే పంటలు భాగా పండి రైతు లాభ పడతాడని ఉద్యానవన శాఖ సహాయ సంచాలకురాలు జి.వి.లక్ష్మి అన్నారు. మండలంలోని గంగుపూడి గ్రామంలో సోమవారం ఉద్యానవన పంటలపై అవగాహన సదస్సు జరిగింది. జీడిమామిడితోటల్లో చేయవలసిన యాజమాన్య పద్దతులపై రైతులకు ఉద్యానవనశాఖవారు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహాయ సంచాలకురాలు జి.వి.లక్ష్మి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు చేపట్టవలసిన చర్యలు రైతులకు వివరించారు. భూగర్భజలాలు పెంపొందించి తద్వారా దిగుబడులు పెంచుకోవచ్చు అని ఆమె అన్నారు. శాస్తవ్రేత్త ఉమాదేవి మాట్లాడుతూ పంటలపై పురుగు, తెగుళ్ళు రాకుండా యాజమాన్య పద్దతిపై వివరంగా చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాంబాబు, ఎంపీటీసీ, ఎంపీఇవొ పార్వతిలు పాల్గొన్నారు.