విశాఖ

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డుంబ్రిగుడ, నవంబర్ 19: వైసీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అరకులోయ నియోజకవర్గం వైసీపీ నాయకులు దొన్నుదొర కోరారు. డుంబ్రిగుడ సంతబయలు గ్రామంలో సోమవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాల్సి ఉందని అన్నారు. ఏజెన్సీలో దేశం ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను గిరిజనులకు వివరించి, తమ పార్టీ నవ రత్నాల కార్యక్రమాన్ని తెలియచేయాలని ఆయన కోరారు. అనంతరం జగన్ కావాలి, జగన్ రావాలి అనే నినాదంతో డుంబ్రిగుడలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొర్రా సీతారాం, జగన్‌కుమార్, కొర్రా భగవాన్, కె.బాబురావు, పాంగి సుబ్బారావు, వంతాల గెన్ను, మధు, తదితరులు పాల్గొన్నారు.

భక్తులతో పోటెత్తిన శివాలయాలు
కోటవురట్ల, నవంబర్ 19: కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా మండలంలో కోటవురట్ల, లింగాపురం, కైలాసపట్నం, యండపల్లి,పందూరు తదితర శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే భక్తులు వరహానదిలో స్నానాలు ఆచరించి శివాలయాలు వద్ద క్యూలో నిల్చుని శివుడిని దర్శించుకుని ప్రత్యేక అబిషేకాలు, పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఈసందర్భంగా స్థానిక శివాలయం ప్రధానార్చకులు బ్రహ్మయ్యశర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో వచ్చే సోమవారం శివుడిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయన్నారు.
విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు
కోటవురట్ల, నవంబర్ 19: గ్రంథాలయ వారోత్సవాలను పురష్కరించుకుని స్థానిక శాఖా గ్రంథాలయంలో సోమవారం కోటవురట్ల జూనియర్ కళాశాల విద్యార్థినులకు రంగ వల్లుల పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక శాఖా గ్రంథాలయాధికారి ఎన్.రాజుబాబు మాట్లాడుతూ బాలికలను ప్రోత్సహించేందుకు రంగవల్లుల కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. విజేతలకు ఈనెల 20న గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా బహుమతులు అందిస్తామన్నారు.
మరుగుదొడ్లును వాడుదాం
కొయ్యూరు, నవంబర్ 19: ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లును వాడడం వలన అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చని వక్తలు పేర్కొన్నారు. మండలంలోని ప్రపంచ మరుగుదొడ్లు దినోత్సవం సందర్భంగా పంచాయతీల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తోందన్నారు. ప్రతీ ఒక్కరూ మరుగుదొడ్లును వాడడం వలన వ్యాధులను అదిగమించడంతో పాటు ఆత్మగౌరవాలను పెంపొందించుకోవచ్చన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన వలన వివిధ రకాల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ మరుగుదొడ్లు వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈసందర్భంగా గ్రామాల్లో ఆయా పాఠశాలల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలకు మరుగుదొడ్లు వినియోగంపై అవగాహన కల్పించారు.

ఘనంగా ఇందిరా జయంతి
కొయ్యూరు,నవంబర్ 19: స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని మండలంలోని రావణాపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పండా యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో ఉన్న ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కన్నూరు సత్యనారాయణ, యుగంధర్‌లు మాట్లాడుతూ పేద ఫ్రజల అభ్యున్నతికి ఇందిరాగాంధీ ఎనలేని సేవలు చేసారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కొనసాగిందన్నారు. రాష్ట్రం, దేశం కాంగ్రెస్ పాలనలో ఎంతో అభివృద్ది సాధించిందన్నారు. ఈసందర్భంగా ఇందిరాగాంధీ సేవలను నేతలు కొనియాడారు. అనంతరం చిన్నారులకు రొట్టెలు, స్వీట్లు పంచారు. ఈకార్యక్రమంలో పలువురు స్థానిక మహిళలు , పెద్దలు పాల్గొన్నారు.