శ్రీకాకుళం

23న సత్యసాయిబాబా జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ, నవంబర్ 20: స్థానిక శ్రీసత్యసాయిబాబా మందిరంలో ఈ నెల 23 శుక్రవారం బాబా వారి 93వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు సత్యసాయి సేవా సమితి కన్వీనర్, సభ్యులు తెలిపారు. జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం బాల వికాస్ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వారికి బహుమతులు అందించారు. అలాగే 21న యూత్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. 22న సేవాదల్ దినోత్సవం సందర్భంగా నిత్యాన్నదాన లబ్ధిదారులకు దుప్పట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. నిత్య అన్నదాన పథకానికి అనేక మంది శాశ్వత విరాళ దాతలు ప్రతి నెలా బియ్యం, కూరగాయలు, కిరాణా అందించే దాతలు ఉన్నారన్నారు. 23న నగర సంకీర్తనతో ప్రారంభమైన బాబా వారి జయంతి వేడుకలు పతాకావిష్కరణ, జ్యోతి ప్రజ్వలన, స్వామివారి చిత్రపటానికి పూలమాలంకరణ, బర్త్‌డే కేక్ సమర్పణ, దుస్తులు పంపిణీ అనంతరం ఆధ్యాత్మిక సభ ఉంటుందన్నారు. మధ్యాహ్నం మహా నారాయణసేవ తదుపరి సాయంత్రం 7 గంటలకు సత్యసాయి నామసంకీర్తన, ఊయల సేవ, హారతి వంటి కార్యక్రమాలతో ముగుస్తుందని తెలిపారు.

శివ్వాం పాఠశాలను సందర్శించిన ఎం ఈవో
వంగర, నవంబర్ 20: శివ్వాం ఎంపీ పీ ఎస్ పాఠశాలను మంగళవారం ఎం ఈవో దుర్గారావు సందర్శించారు. పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థులకు చిట్టిచేతులు... చక్కని రాతలపై పరీక్షను నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న భోజనం పనితీరు చూశారు. పిల్లలకు నాణ్యతతో కూడిన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంగ్లంలో వెనుకబడిన 140 మంది పిల్లలకు వి.శ్రీనివాసరావునాయుడు ఆంగ్ల మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం వాసు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

షాపులు వెంటనే ఖాళీ చేయాలి
* సబ్‌రిజిస్ట్రార్ ఆదేశం
రాజాం, నవంబర్ 20: సుమారు రూ.50 లక్షలతో నిర్మించిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ నూతన భవనం ముందు సుమారు 20 వరకు బడ్డీలు వెంటనే తొలగించాలని స్థానిక సబ్‌రిజిస్ట్రార్ ఈశ్వరమ్మ ఆదేశించారు. మంగళవారం ఆ ప్రాంతానికి సబ్‌రిజిస్ట్రార్ చేరుకొని ఆక్రమణదారులతో చర్చించారు. అయితే తమకు సమయం కావాలని ఆక్రమణదారులు కోరడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి రెండు రోజుల్లో షాపులన్నీ తొలగించుకోవలని, ప్రహరీ గోడ నిర్మించాల్సి ఉందన్నారు. దీనిని ప్రారంభించేందుకు అధికారుల ఆదేశాలు వచ్చాయని వారితో ఆమె అన్నారు. తమకు వారం రోజులు వ్యవధి కావాలని వ్యాపారులు విజ్ఞప్తి చేశారు.

జగన్ పాదయాత్ర విజయవంతం చేయండి
* రాజన్న బిడ్డను అక్కున చేర్చుకోండి
పాలకొండ (టౌన్), నవంబర్ 20: ఈ నెల 25న జిల్లాలో ప్రారంభంకానున్న వైకాపా అధినేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజియన్ కో- ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మంగళవారం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జగన్ పాదయాత్ర జిల్లాలో ప్రారంభంకానున్న సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి శ్రీకాకుళం జిల్లా ప్రజలు అత్యధిక స్థానాలను అందించారన్నారు. అదే మాదిరిగా ఆయన బిడ్డను అక్కున చేర్చుకొని అత్యధిక స్థానాల్లో విజయం సాధించే దిశగా ప్రజలు సహకారం అందించాలన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు కలిగించేందుకు గత పది నెలలుగా ఆయన ప్రజల సమస్యలు వింటూ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున స్పందన చూపుతున్నారన్నారు. వైకాపా నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇసుక, మద్యం మాఫియాలు మధ్య సామాన్య జనం పడుతున్న సమస్యలను అధిగమించాలంటే జగన్మోహన్‌రెడ్డికి మద్దతు పలకాలన్నారు.