రాష్ట్రీయం

మనమే నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 20: నాలుగేళ్ళ పసిగుడ్డు తెలంగాణ అన్ని రంగాల్లో నేడు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని, దీనిని చూసి ఓర్వలేక నాశనం చేసేందుకు కొంతమంది మళ్ళీ యత్నిస్తున్నారని, వారి కుతంత్రాలు అడ్డుకుని, తిప్పికొట్టేందుకు యావత్ రాష్ట్ర ప్రజానీకం సిద్ధం కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీ ఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యమ ట్యాగ్‌లైన్ అయిన నీళ్ళు, నిధులు, నియామకాల్లో మొదటగా రాష్ట్రంలో నెలకొన్న నీటి కొరతను తీర్చేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుని ముందుకు సాగినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అనేక ప్రాజెక్టులు గత నాలుగున్నరేళ్ళలో ప్రారంభించి, తుది దశకు చేర్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఏడు ఉమ్మడి జిల్లాలకు ఆయువుపట్టు అయన కాళేశ్వరం ప్రాజెక్టు మరికొద్ది మాసాల్లో పూర్తికానుండగా, వచ్చే జూన్ నాటికి ప్రారంభం కాబోతుందన్నారు. దానిని ప్రారంభించిన మరుక్షణం నుంచే కరీంనగర్ జిల్లా వాటర్ జంక్షన్‌గా మారబోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 70శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, ఎన్నో వ్యయప్రయాసల కోర్చి పంటలు పండిస్తే గిట్టుబాటు ధరల్లేక రైతన్నలు విలవిల్లాడుతున్నారని ఆవేదన చెందారు. రైతులను ఆదుకునేందుకు అనేక పథకాలు రూపొందించి, అమలు చేస్తున్నా, గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. కనీస మద్దతు ధరతోనే రైతుల కళ్ళలో ఆనందం చూస్తామని, రైతులు సంతోషంగా
ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం సరికొత్త పథకాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల అనంతరం మద్ధతు ధర పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. చైతన్యవంతమైన ప్రాంతం హుజురాబాద్‌లోరైతాంగానికి వచ్చే పంటకు కూడా ఎస్సారెస్పీ నుంచి సాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో 365 రోజుల పాటు చెక్‌డ్యాములు నీరు నిండి కలకలలాడనున్నాయన్నారు. బాలారిష్టాల నుంచి ఇపుడిపుడే బయల్పడుతున్న రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని, ఆర్ధిక పెరుగుదలతో పాటు, చిరుద్యోగులు సైతం అత్యధిక వేతనం పొందుతున్నారని, రెప్పపాటు కరెంటు కూడా పోకుండా రాష్ట్రాన్ని వెలుగుల మయంగా మార్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనన్నారు. నాలుగేళ్ళుగా రాష్ట్రంలో విద్యుత్ కోతల్లేవు.. బిల్లుల మోతల్లేవు... భవిష్యత్‌లో కూడా మిగులు విద్యుతే తప్ప, పవర్ కట్ ప్రాబ్లముండదని భరోసా ఇచ్చారు. సకల సంతోషాలతోరాష్ట్రం ముందుకు సాగుతుంటే, కొన్ని దుష్టశక్తులు తిరిగి, తమ చేతుల్లోకి లాక్కునే యత్నం చేస్తున్నాయని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది సంక్షేమ ఫలాలు పేదలకు అందాలంటే, యావత్ ప్రజానీకం అప్రమత్తంగా ఉంటూ, దొంగలను తరిమికొట్టాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే కథ మళ్ళీ మొదటికే వస్తుంది..తస్మాత్ జాగ్రత్త అంటూ సభికులను జాగృతం చేశారు. ఈ సభలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆపద్ధర్మ ఆర్ధిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, తెరాస సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు,మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ అక్భర్ హుస్సేన్, నాయకులు కెప్టెన్ లక్ష్మికాంతారావు, కేతిరి సాయిరెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు పలు మండలాల నుంచి వచ్చిన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్రాలు.. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంగళవారం సిద్దిపేట - దుబ్బాక నియోజకవర్గాల ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. *పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు