నిజామాబాద్

స.హ.చ ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డిరూరల్, నవంబర్ 21: సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పకడ్బందీగా అమలు చేయాలని స.హ.చ రాష్ట్ర డైరెక్టర్ ఎంఎ సలీం అన్నారు. బుదవారం జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త సెక్షన్ 6(1) అమలు చేయాలని అన్నారు. సమాచార హక్కు చట్టం తో ప్రజాధనాన్ని కపాడాలని అన్నారు. మండల స్థాయి కమిటీలను బలోపేతం చేయాలని అన్నారు. గతంలో పని చేసిన సమాచార హక్కు చట్టం రాష్ట్ర ఉపాద్యక్షులు డాక్టర్ పుట్టమల్లికార్జున్ రాజరుూయాల్లోకి వెళ్ళడం వలంల ఏకగ్రీవంగా తొలగించడం జరిగిందని అన్నారు. రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సభ్యత్వం ఇవ్వడం జరుగదని తెలిపారు. జిల్లా అధ్యక్షులు అంకం శ్యాంరావ్, రాష్ట్ర సలహాదారులు రాజన్న, ముదాం శంకర్‌పటేల్, భట్టు ఆనంద్‌రావ్, ఆనంద్‌రావ్, శ్రీ్ధర్, అల్లే రవి, నరేశ్, సుల్తాన్, స్వామి ఉన్నారు.

వాహనాల తనిఖీ ముమ్మరం
భిక్కనూరు, నవంబర్ 21: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై పోలీస్‌లు పెట్రోలింగ్ తనిఖీలు ముమ్మరం చేశారు. గత 15 రోజులుగా ముమ్మర తనిఖీలు చేస్తున్న పోలీస్‌లకు ఈ మద్యనే డబ్బులు దొరకగా ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. జాతీయ రహదారిపై వచ్చి వెళ్ళే ప్రతీ ఒక్క వాహానాన్ని క్షుణంగా తనిఖీ చేస్తూ వాహానాలను వదిలి పెడుతున్నారు.

మంచి ఫలితాల కోసం కృషి చేయాలి
- జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్
మోర్తాడ్, నవంబర్ 21: విద్యారంగమైనా, క్రీడారంగమైనా ప్రతి ఒక్కరు మంచి ఫలితాల కోసం కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. మోర్తాడ్‌లో గడిచిన మూడు రోజులుగా జరుగుతున్న మండలస్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీల ముగింపు వేడుకలు బుధవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి డీఇఓ దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. క్రీడా పోటీల్లో పాల్గొనే జట్లు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాల్సి ఉంటుందని, అదే విధంగా విద్యార్జనలోనూ క్రమశిక్షణతో కూడిన లక్ష్యాన్ని ఏర్పర్చుకోవాలన్నారు. రానున్న 10వ తరగతి పరీక్షల్లో జిల్లాను రాష్టస్థ్రాయిలో ప్రథమ స్థానంలో నిలిపేలా విద్యాశాఖ కృషి చేస్తోందని, విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
వ్యాయామ ఉపాధ్యాయుడిపై దాడి
ఇదిలాఉండగా, క్రీడా పోటీలను నిర్వహిస్తున్న సురేందర్ అనే వ్యాయామ ఉపాధ్యాయుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా కోర్టులోకి వచ్చారంటూ కొందరు వ్యక్తులను ప్రక్కకు నెట్టివేయడంతో ఆగ్రహించిన వారు పీఇటీ సురేందర్‌పై భౌతిక దాడికి దిగారు. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి, వ్యాయామ ఉపాధ్యాయులంతా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.