క్రీడాభూమి

దూకుడే మా బలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 11: ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్‌లో దూకుడుగానే ఆడతామని, ఆ వ్యూహంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ స్ప ష్టం చేశాడు. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ చేరిన భారత్‌కు మరింత ముందుకువెళ్లే అవకాశాలు ఉన్నాయన్నాడు. దూకుడే తమ బలమని, రక్షణాత్మక విధానాన్ని అనుసరించడం వల్ల అనుకు న్న లక్ష్యాలను అందుకోలేమని పేర్కొన్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రత్యర్థి ఎవరనే విషయాన్ని గురించి తాము ఆలోచించడం లేదని ఒక ప్రశ్న కు సమాధానంగా చెప్పాడు. మ్యాచ్ ఆరంభమై న మరుక్షణం నుంచి దాడులకు ఉపక్రమిస్తే, ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రత్యర్థి జట్టుకు లా భం చూకూరుతుందనే వాదనను మన్‌ప్రీత్ తో సిపుచ్చాడు. పూర్తి రక్షణాత్మక విధానాన్ని అనుసరించినంత మాత్రాన విజయం లభిస్తుందని అనుకోవడానికి వీల్లేదన్నాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, ప్రపంచ చాంపియన్‌షిప్ వంటి మె గా ఈవెంట్‌లో ప్రతి మ్యాచ్ కీలకమని వ్యాఖ్యానించాడు. అందుకే, గ్రూప్ దశ నుంచే ప్రతి ఒక్క పోరును ఒక ఫైనల్‌గానే భావించి పోరాడతామని చెప్పాడు. టైటిల్ గెలిచే అవకాశాలు తమకు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశాడు. అయితే, ప్రత్యర్థి జట్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని తెలిపాడు. ఒకవైపు రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటూనే, దాడులను ముమ్మరం చేస్తామని, ఇప్పటి వరకూ అనుసరించిన, ఇకపై అనుసరించే వ్యూహం ఇదేనని మన్‌ప్రీత్ స్పష్టం చేశాడు.