రంగారెడ్డి

మహేశ్వరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సునామీ సృష్టించినా మహేశ్వరం నియోజకవర్గంలో మహాకూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా సబితా ఇంద్రారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించినందుకు అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం మహేశ్వరంలో ఎమ్మెల్యే అథితి గృహంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో నియోజకవర్గానికి బస్ డిపో, మోడల్ స్కూల్, ఫైర్ స్టేషన్, రోడ్లు, పాఠశాలల భవనాలు నిర్మాణం చేశామని, వంద పడకల ఆసుపత్రి, క్రీడా స్టేడియం మంజూరు చేసినా టీ అర్ ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని గుర్తుచేశారు. ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాతామని, నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు మంచినీటి సమస్యలు పరిష్కరిస్తాతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి ఎన్ ఈశ్వర్ నాయక్, ఎంపిపి స్నేహ, వైస్ ఎంపిపి స్వప్న, ఎంపిటిసి ప్రేమలత శివమూర్తి, నవీన్, అంబయ్య యాదవ్, అల్లె బిక్షపతి, సుధీర్‌గౌడ్‌తో పాటు మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక చేనేత, హస్తకళలు
కుషాయిగూడ, డిసెంబర్ 12: తెలంగాణ సంప్రదాయానికి చేనేత, హస్తకళలు ప్రతీకగా నిలుస్తాయని నిర్వాహకులు నవీన్, అఫ్జల్ అన్నారు. కాప్రాలోని ఏఎస్‌రావునగర్ సొసైటీగ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళల ప్రదర్శన మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సొసైటీ గ్రౌండ్‌లో డిసెంబర్ 25 వరకు ఉదయం 10గంటల నుండి రాత్రి 10గంటల వరకు ఉచితంగా చేనేత, హస్తకళల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శన సామాన్య ప్రజల అభిరుచులకు అనుగుణంగా చేనేత నేత వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలోని నిర్మల్, పోచంపల్లి, నారాయణపేట్, ఉప్పాడ, మంగళగిరి, కలంకారి, గద్వాల్ చీరలు మహిళలను ఆకట్టుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఫ్యాన్సీ, ఖాదీ, కాటన్, ప్రింటెడ్, బెంగాల్ సిల్క్, కాంత్‌సిల్క్, గుజరాత్ డిజైన్‌సిల్క్, లక్నోటాప్స్ అన్ని వర్గాల ప్రజలను అమితంగా ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఈప్రదర్శనలో గృహోపకరణాలకు సంబంధించిన డోర్‌కర్టన్స్, డోర్‌మ్యాట్స్, వరంగల్ చేనేత టవల్స్, జైపూర్ బెడ్‌షీట్స్, ఖాదీ ప్రింటెండ్ టాప్స్, రాజస్తానీ బెడ్‌షీట్స్ మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈప్రదర్శనలో వివిధ రకాలైన ఆయుర్వేద మొక్కలను అమ్మబడతాయని తెలిపారు. వన్‌గ్రామ్ గోల్డ్, వివాహ శుభకార్యాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.