హైదరాబాద్

సిటీ ఎమ్మెల్యేల్లో ఆరుగురు అధ్యక్షులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు నగర నాయకత్వం వహించిన వారు కావటం విశేషం. వీరిలో అంబర్‌పేట నుంచి గెలుపొందిన కాలేరు వెంకటేశ్ మినహా మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు వివిధ పార్టీలకు అధ్యక్షులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. గత 2014 ఎన్నికల్లో సికిందరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించిన టీఆర్‌ఎస్ ఇపుడు మొత్తం ఏడు స్థానంలో విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే! ఆ తర్వాత టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావును నియమించినా, పరోక్షంగా నగరంలోని మొత్తం గులాబీ క్యాడర్‌ను ముందుకు నడిపింది పద్మారావు, ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవేనని చెప్పాలి. నగరంలో గెలిచిన టీఆర్‌ఎస్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు నగర నాయకత్వం వహించిన వారే. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు సిటీ ప్రెసిడెంట్లుగా వ్యవహరించిన నేతలు ఇపుడు ఒకే పార్టీలో ఎమ్మెల్యేలు కావటం విశేషం. వీరందరికి నగరంపై మంచి పట్టు, అన్ని వర్గాలు, ఇతర పార్టీ నేతలతో సత్సంబంధాలున్నాయి. అంతేగాక, వీరిలో పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ముఠాగోపాల్, దానం నాగేందర్‌లకు మాస్ మొదలుకుని, క్లాస్ ప్రజల్లో కూడా చక్కటి ఫాలోయింగ్ ఉంది. అదే తరహాలో తరుచూ పార్టీలు మారిన కొందరిపై ప్రజల్లో వ్యతిరేకత కూడా లేకపోలేదు. తెలంగాణ ఉద్యమం తుది దశలో టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడిగా సికిందరాబాద్ ఎమ్మెల్యే టీ. పద్మారావు వ్యవహరించగా, అదే సమయంలో టీడీపీ నగర అధ్యక్షులుగా మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అధ్యక్షులుగా దానం నాగేందర్ వ్యవహరించారు. అంతకు ముందు పలు దఫాలుగా నగర టీడీపీ పార్టీ అధ్యక్షులుగా సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, కంటోనె్మంట్ ఎమ్మెల్యే జి. సాయన్న చాలా కాలం వ్యవహరించారు. ఇక ముఠాగోపాల్ ప్రస్తావనకొస్తే ఆయన దాదాపు రెండు దశాబ్దాల క్రితమే టీడీపీ నగర అధ్యక్షుడిగా వ్యవహరించారు. గత 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని భావించిన ముషీరాబాద్ నియోజకవర్గం టీడీపీ, బీజేపీ పొత్తులో బీజేపీకి దక్కటంతో, ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలై, ఈసారి అఖండ విజయాన్ని సాధించారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ 2009 నుంచి 2014, తెలంగాణ ఉద్యమం కీలక సమయంలోనూ జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌కు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించి, అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలకు చెందిన వంద మంది కార్పొరేటర్లతో చక్కటి సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్‌లో చేరి, ఎన్నికల్లో సతీమణి కాలేరు పద్మను కార్పొరేటర్‌గా గెలిపించుకుని, ఇపుడు ఆయన అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యే అయ్యారు. మొత్తానికి నగరంలోని 15 అసెంబ్లీ స్థానాల్లో ఏడు స్థానాల నుంచి గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు ప్రధాన పార్టీలకు సుదీర్ఘకాలం నగర అధ్యక్షులుగా వ్యవహరించిన అనుభవం ఉండటంతో వీరి హయాంలో సిటీలో టీఆర్‌ఎస్ మరింత బలోపేతమయ్యే అవకాశాలున్నాయి.