తెలంగాణ

ఈవీఎంలపై అనుమానమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) లపై అనుమానం వ్యక్తం చేయడం పట్ల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలను దుర్వినియోగం చేశారని, ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా ఈవీఎంలలో మార్పులు, చేర్పులు చేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్‌రెడ్డి చేసిన విమర్శలను మీడియా ప్రతినిధులు రజత్ కుమార్ దృష్టికి బుధవారం తీసుకువెళ్లగా ఆయన తీవ్రంగా స్పందించారు. ఈవీఎంలన ఎవరూ మార్చలేరని, ఒక పర్యాయం ఓట్లు నమోదైన తర్వాత చిన్నపాటి మార్పు కూడా చేయలేరని వివరించారు. పోలింగ్ తర్వాత ఈవీఎంలను రాజకీయ పార్టీల ఏజంట్ల సంతకాలు తీసుకుని వారి ముందే సీల్ చేశాలని, వీటిని పటిష్టమైన పోలీసు బందోబస్తుతో స్ట్రాంగ్ రూంలకు చేర్చామని వివరించారు. కౌంటింగ్‌కు ముందు ఈవీఎంలను తెరిచేముందు మళ్లీ రాజకీయ పార్టీల ఏజంట్టకు చూపించి తెరిచామన్నారు. ఈవీఎంలపై అనుమానపడటం సరైన విధానం కాదని వివరించారు. ఈ విషయం శాస్ర్తియంగా అనేక పర్యాయాలు రూఢీ అయిందన్నారు.