తెలంగాణ

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కొందరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఆసక్తి కనబర్చుస్తున్నట్టు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియా చిట్‌చాట్‌లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా రామగుండం నుంచి గెలుపొందిన టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి కోరుకంటి చందర్, ఖమ్మం జిల్లా వైరా నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందిన రాములు నాయక్ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు వీరు ఇద్దరూ బుధవారం కేటీఆర్‌ను కలిసి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. రామగుండం నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన కోరుకంటి చందర్ టికెట్ దక్కక పోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణను ఓడించిన విషయం తెలిసిందే. తాను ఎన్నికలకు ముందు వరకు టీఆర్‌ఎస్ సభ్యుడినేనని కోరుకంటి చందర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందిన రాములు నాయక్ బుధవారం సాయంత్రం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను కలిసారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్టు రాములు నాయక్ తెలిపారు. వీరు ఇద్దరు పార్టీలో చేరితే టీఆర్‌ఎస్ బలం 90కి చేరుకోనుంది.
అవమానించిన కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తాను కుటుంబ సమేతంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసానని అన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని, అలా చేసినా కాంగ్రెస్‌కు ఉపయోగం ఉండదని తాను చెప్పానని ఆయన తెలిపారు. మరోవైపు అప్పట్లో తమ పార్టీ నాయకురాలైన సినీ నటి విజయశాంతికి సోనియా కండువా కప్పారని, విజయరామారావు, చంద్రశేఖర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకుని అవమానించారని ఆయన చెప్పారు. దీంతో తాను ఒంటరిగానే పోటీ చేద్దామని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. అయితే ఒంటరిగా పోటీ చేయడం ద్వారా నష్టపోతామా?, అధికారంలోకి వస్తామా? అనే ఆలోచన చేశామని ఆయన తెలిపారు. అప్పుడు ఉత్తర తెలంగాణ వైపు దృష్టి సారించి 40 సీట్లు సాధించాలని, దక్షిణ తెలంగాణలో 15 సీట్లకు పైగా సాధించుకోవచ్చన్న ధైర్యంతో ముందుకెళ్లామని ఆయన చెప్పారు.
చిత్రం..తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ అధినేత
కే చంద్రశేఖరరావు. వేదికపై జితేందర్‌రెడ్డి, కే కేశవరావు, మహమూద్ అలీ, నాయని నరసింహారెడ్డి తదితరులు