తెలంగాణ

పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఘోరపరాజయం పాలైన బీజేపీ నేతలు కోలుకుని త్వరలో రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించారు. గ్రామాల్లో బీసీ ఓటర్ల జాబితాలను ఎన్నికల అధికారులు ఈ నెల 13,14 తేదీల్లో ప్రదర్శించనున్నారు. 15వ తేదీన తుది జాబితాలు ఇస్తారు. 2018 ఆగస్టుతో కాలపరిమితి ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పాలనలో పంచాయతీలు నడుస్తున్నాయి. ఎస్టీలకు 2634, ఎస్సీలకు 2070, బీసీలకు 3440, జనరల్‌కు 4027 పచాయితీలను రిజర్వు చేయనున్నారు. జనరల్ రిజర్వు అయిన పంచాయతీల్లో ఎవరైనా పోటీ చేసే వీలుంది. జనరల్‌లోనూ మహిళలకు కొన్ని పంచాయతీలను రిజర్వు చేస్తున్నారు. బీజేపీ సైతం వివిధ పంచాయతీల్లో ఉన్న పార్టీ నేతలతో కసరత్తు ప్రారంభించింది. ఏ ఏ పంచాయతీల్లో పోటీ చేసేందుకు వీలుందో, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఎవరో తెలుసుకుంటోంది. జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అభ్యర్ధుల ఎంపిక, ఇతర నిర్ణయాల బాధ్యతను పార్టీ ఆయా జిల్లాల కమిటీలకే అప్పగించింది. జిల్లా స్థాయిలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది.