తెలంగాణ

సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ సీఎంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్భార్ హాలు వేదికగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు తరలిచవ్చారు. సరిగ్గా మధ్యాహ్నాం 1.25 గంటలకు కేసీఆర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. కేసీఆర్‌‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్‌తో పాటు మహమూద్ ఆలీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ‌కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, మహమూద్‌ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, తెరాస ఎంపీలు, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఇతర ప్రముఖులు తరలివచ్చారు.