21న యన్‌టిఆర్ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ హైదరాబాద్‌లో, ఆడియో రిలీజ్ ఈవెంట్ యన్‌టిఆర్ పుట్టిన నిమ్మకూరులో జరగనున్నాయి. డిసెంబర్ 16న ట్రైలర్ లాంచ్, 21న ఆడియో వేడుకకు భారీగా ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇందులో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తున్నారు. విడుదల చేస్తున్న ప్రతీ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. క్రిష్ జాగర్లమూడి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడు, మహానాయకుడు టైటిల్స్‌తో ఈ బయోపిక్ రెండు భాగాలుగా రానుండటం తెలిసిందే. జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్‌రామ్, రానా దగ్గుబాటి, సుమంత్, రకుల్‌ప్రీత్‌సింగ్, లెజెండరీ కైకాల సత్యనారాయణ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.