జాతీయ వార్తలు

ప్రకటనల ఖర్చు రూ. 5, 200 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: కేంద్ర ప్రభుత్వం పత్రికలు, టీవీల్లో ప్రకటన నిమిత్తం 5,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ వెల్లడించారు. 2014-15 సంవత్సరాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం చేసిన ఖర్చును గురువారం లోక్‌సభకు తెలిపారు. 2018 డిసెంబర్ 7వ తేదీ వరకూ యాడ్‌ల పేరుతో ఖర్చుపెట్టిన నిధుల వివరాలు మంత్రి లిఖితపూర్వకంగా సభకు వెల్లడించారు. 2014-15లో 979.78 కోట్లు, 2015-16లో 1,160.16 కోట్లు, 2017-18లో 1.313.57 కోట్లు 2018-19లో ఇప్పటి వరకూ 527.96 కోట్లు యాడ్‌ల కోసం ఖర్చుచేశారు. 2014 నుంచి ఇప్పటి వరకూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, తదితరాల్లో ప్రకటనల కోసం 5,245.73 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్టు సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాథోడ్ స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని బ్యూరో ఆఫ్ ఔట్రిచ్ అండ్ కమ్యూనికేషన్ (బీఓసీ) ద్వారా ఖర్చుచేసినట్టు ఆయన వెల్లడించారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్వర్‌టైజింగ్ అండ్ వీజువల్ పబ్లిసిటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఫీల్డ్ పబ్లిసిటీ, సాంగ్ అండ్ డ్రామా డివిజన్‌లు గత ఏడాదే బీఓపీలో విలీనం చేశారు. పత్రికలలో ప్రకటన నిమిత్తం 2,282 కోట్లు, ఆడియో-వీజువల్ యాడ్‌లకు 2,312. 59 కోట్లు, ఔట్‌డోర్ ప్రకటనలకు 651.14 కోట్లు ఖర్చుచేసినట్టు కేంద్రం వివరించింది.