జాతీయ వార్తలు

20లోగా హాజరుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 13: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్న కమిషన్ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20లోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత 2016లో అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆరోగ్య మంత్రిగా ఉన్న సి.విజయభాస్కర్ ఈనెల 18న తమ ముందు హాజరు కావాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఇప్పటికే ఆదేశించింది. అలాగే జయలలిత సెక్యూరిటీ టీమ్‌లో ఉన్న పోలీస్ ఆఫీసర్ సుధాకర్, సీనియర్ ఏఐడిఎంకె నేత సి.పొన్నయ్యన్ సైతం ఈ కమిషన్ ముందు హాజరు కానున్నారు. కాగా జయలలిత మరణం తర్వాత వివి శశికళతో ఏర్పడిన విభేదాలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆమె మృతిపై తమకు అనుమానాలున్నాయని, దానిపై విచారణ జరపాలని పన్నీర్‌సెల్వం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఆసుపత్రిలో ఉన్న 75 రోజుల్లో ఒక్కసారి కూడా తాను ఆమెను కలవలేకపోయానని అప్పట్లో ఆయన సంచలన ప్రకటన చేశారు. దాంతో 2016, డిసెంబర్ ఐదున జరిగిన జయలలిత మరణంపై తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి విచారణ కమిషన్‌ను నియమించారు.