జాతీయ వార్తలు

సంస్కరణలు మరింత వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ది చేసేందుకు సంస్కరణలను వేగవంతం చేయాలని, నిబంధనలను సరళీకృతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆయన ఇక్కడ ఉన్నతాధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ దేశం మంచి ర్యాంకు సాధించిందన్నారు. ఈ ర్యాంకును సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు ఎక్కువగా వచ్చేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. చిన్న వర్తకులకు ఉపయోగపడే విధంగా ప్రణాళికను రూపొందించాలన్నారు. ఆర్ధిక రంగం అభివృద్ధికి అనేక ప్రణాళికలు ఉన్నాయని, వీటి ఫలాలు చిన్న వర్తకులకు అందించాలన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందన్నారు. ఈసమావేశంలో ఉన్నతాధికారులు దేశంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలనువివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నిర్మాణ రంగంలో అనుమతులు, కాంట్రాక్టుల అమలు, ఆస్తుల నమోదు, వాణిజ్య వ్యవస్థ విధానాలు, దివాలా ప్రక్రియ చట్టంలో సవరణలు, విద్యుత్ రంగం అంశాలను వివరించారు. వీటి అమలులో తొలి దశలో ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేసి నివేదికలు ఇస్తామన్నారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు వివిధరాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు.